కమల్ హాసన్ - మణిరత్నం చిత్రంలో హీరోయిన్ త్రిష, ఆ మలయాళ స్టార్ కూడా.. అఫీషియల్ అప్డేట్
ఈరోజు సాయంత్రం KH234 టైటిల్ వీడియో రాబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో యూనిట్ హీరోయిన్, మలయాళ స్టార్ ను ప్రకటిస్తూ కీలకమైన అప్డేట్ ను అందించింది.
లోకనాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) ప్రస్తుతం భారీ చిత్రాలను లైనప్ చేశారు. ఇప్పటికే ‘ఇండియన్2’ రిలీజ్ కు ఏర్పాట్లు చేసుకుంటూ అప్డేట్స్ అందిస్తోంది. ఈ క్రమంలో కమల్ హాసన్ మరో భారీ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కిస్తున్నారు. ప్రముఖ తమిళ ప్రముఖ దర్శకుడు మణిరత్నం (Mani Ratnam) తో చాలా కాలం తర్వాత మళ్లీ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. వీరి ఇద్దరి కాంబోలో 35 ఏళ్ల కింద 1987లో ‘నాయకన్’ వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసింది.
ఇన్నాళ్లు మళ్లీ ఇప్పుడు KH234తో ఈ కాంబినేషన్ సెట్ అవ్వడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం ఇప్పటికే గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కమల్ హాసన్, మణిరత్నం, ఆర్.మహేంద్రన్, శివ అనంత్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే కమల్ హాసన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలై ఆకట్టుకుంటోంది.
ఈక్రేజీ ప్రాజెక్ట్ కు టైటిల్ కూడా ఫిక్స్ అయ్యింది. ఈరోజు సాయంత్రం 5 గంటలకు సినిమా టైటిల్ ను అనౌన్స్ చేస్తూ వీడియోను విడుదల చేయబోతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా స్టార్ కాస్ట్ ను కూడా ప్రకటిస్తూ వస్తున్నారు యూనిట్. చిత్రంలో మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం సౌత్, బాలీవుడ్ లో దుమ్ములేపుతున్న దుల్కర్ కమల్ హాసన్ తో కలిసి నటించబోతుండటం ఆడియెన్స్ కు మరింత కిక్కిస్తోంది.
అలాగే చిత్రంలో హీరోయిన్ గా సౌత్ క్వీన్ త్రిష కృష్ణన్ (Trisha Krishnan) ఎంపికైంది. మరింత కొంత మంది నటీనటుల వివరాలను టీమ్ విడుదల చేస్తూ వస్తోంది. ఇంకా ఎవరెవరు నటిస్తున్నారోనన్నది ఆసక్తికరంగా మారింది. దీంతో సినిమాపై మంచి బజ్ క్రియేట్ అవుతోంది. ఇక ఇప్పటికే టాప్ టెక్నీషియన్లు తమ సినిమాకు పనిచేస్తున్నారని ప్రకటించిన విషయం తెలిసిందే. AR రెహమాన్ సంగీతం, ఎడిటర్ గా శ్రీకర్ ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ రవి కె చంద్రన్, యాక్షన్ కోరియోగ్రఫీని అన్బరీవ్ మాస్టర్స్ అందిస్తున్నారు. ప్రొడక్షన్ డిజైనర్‌గా శర్మిష్ట రాయ్, కాస్ట్యూమ్ డిజైనర్‌గా ఏఖా లఖానీ వర్క్ చేస్తున్నారు. మరోవైపు కమల్ హాసన్ ‘ఇండియన్2’, ‘కల్కి’ చిత్రాలతోనూ అలరించబోతున్నారు.