ప్రభాస్ నటిస్తున్న `కల్కి2898ఏడీ` నుంచి కమల్ హాసన్ లుక్ లీక్ అయ్యింది. అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ప్రభాస్ తరహాలోనే ఉంటూ షాకిస్తుంది.
దర్శకుడు నాగ్ అశ్విన్.. ప్రస్తుతం ప్రతిష్టాత్మకంగా `కల్కి2898ఏడీ` చిత్రాన్ని రూపొందిస్తుంది. మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ మూవీగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. భారత పురాణాలకు, సైన్స్ కి ముడిపెట్టి నాగ్ అశ్విన్ ఈ ప్రయోగం చేస్తున్నాడు. దీనిపై అందరిలో క్యూరియాసిటీ ఉంది. ఎలా మిక్స్ చేయబోతున్నాడు, ఎలా కన్విన్స్ చేస్తాడనేది తెలుసుకునేందుకు చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అయితే కంటెంట్ పరంగా ఇప్పటి వరకు వచ్చిన ఏదీ ఆకట్టుకునేలా లేదు. పైగా విషయం అర్థం కాని విధంగా ఉంది. ఇది ఆడియెన్స్ కి ఎలా అర్థమవుతుందనేది పెద్ద ప్రశ్న.
దీనికితోడు ప్రభాస్ లుక్ సెట్ కాలేదు. ఆయన గెటప్ వింతగా ఉందనే విమర్శలు వస్తున్నాయి. సినిమా మొత్తంలో ఆయన లుక్ మాత్రమే సెట్ కాలేదంటున్నారు ఫ్యాన్స్. డార్లింగ్ విగ్ సైతం వెరైటీగా ఉంది. ఈ నెలలో విడుదల కావాల్సిన ఈ మూవీ వాయిదా పడిన విషయం తెలిసిందే. వచ్చే నెలకి షిఫ్ట్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఈ మూవీ నుంచి అప్‌డేట్స్ కోసం ఫ్యాన్స వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఓ లీక్ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. సినిమాలో కమల్ హాసన్ లుక్ లీక్ అయ్యింది.
ఇందులో లోకనాయకుడు కమల్ హాసన్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఆయనది నెగటివ్ రోల్ అని తెలుస్తుంది. సినిమా క్లైమాక్స్ లో ఆయన పాత్ర వస్తుందట. అయితే సెకండ్ పార్ట్ లో ఆయన రోల్ పూర్తిగాఉంటుందట. తాజాగా ఆయన లుక్ లీక్ అయ్యింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇందులో యంగ్ లుక్‌లో కనిపిస్తున్నారు కమల్. ప్రభాస్ తరహాలో కాస్ట్యూమ్ ధరించారు. జుట్టు ఫ్రీగా వదిలేసినట్టుగా ఉంది. చూడబోతుంటే ప్రభాస్ గెటప్ మాదిరిగానే.. కమల్ లుక్ కనిపిస్తుంది. అయితే ఇందులో ఆయనపాత్ర ఏంటనేది పెద్ద సస్పెన్స్. త్వరలోనే కమల్ లుక్‌ని విడుదల చేయబోతున్నట్టు సమాచారం.
ప్రభాస్ భైరవ పాత్రలోనటిస్తున్నారు. అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ పాత్రలో కనిపించబోతున్నారు. కమల్ పాత్ర ఏంటనేది తెలియాల్సి ఉంది. వీరితోపాటు దీపికా పదుకొనె, దిశా పటానీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నాని, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ గెస్ట్ లుగా మెరుస్తున్నారు. అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నారు.
