లోక నాయకుడు కమల్‌హాసన్ ప్రస్తుతం ఇండియన్ 2 షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్నాడు. యంగ్ హీరోలతో పోటీ పడుతూ.. షూటింగ్ ను పరుగులు పెట్టిస్తున్న కమల్.. తాజాగా రిలాక్స్ మూడ్ లోకి వెళ్లిపోయాడు. ఇండియన్ 2 షూటింగ్ కోసం విదేశాలకు వెళ్ళిన.. ఆయన వరుస అప్ డేట్స్ ఇస్తూ వస్తున్నాడు.
ఇండియన్ 2 షూటింగ్ ఆ మధ్య తైవాన్ లోజరిగినప్పటి ఫోటోలను కూడా అభిమానులకోంస అందించాడు కమల్ హాసన్. షూటింగ్ కు సబంధించిన చాలా పిక్స్ ను ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ.. భారతీయుడు2పై క్యూరియాసిటీ పెంచేస్తున్నాడు లోక నాయకుడు. ఇక ఇప్పుడు మరో అప్‌డేట్‌ను వీడియో రూపంలో అందించాడు కమల్ హాసన్.
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో కమల్‌హాసన్ ది ప్రత్యేక చరిత్ర. లోకనాయకుడిగా వెలుగు వెలుగుతున్న కమల్.. కుర్ర హీరోలకు కూడా పోటీ ఇస్తూ.. దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఇండియన్ 2 లో నటిస్తున్న కమల్ హాసన్.. ఈసినిమా షూటింగ్ ను సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తున్నాడు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇండియన్ 2 షూటింగ్ రీసెంట్ గా తైవాన్ లో కంప్లీట్ చేసుకుంది. ఆ షూటింగ్ ఫోటోలు మొన్నటి వరకూ వైరల్ అవుతూ వచ్చాచి.
తాజాగా ఈమూవీ షూటింగ్ సౌతాఫ్రికాకు చేరింది. అక్కడ షూటింగ్ షెడ్యూల్‌లో శంకర్ టీం ఫుల్ బిజీగా ఉన్నారు. సౌతాఫ్రికాలో 12 రోజులపాటు యాక్షన్ సీక్వెన్స్ ను ప్లాన్ చేసింది శంకర్ టీం. దీని కోసం కమల్ హాసన్ ప్రస్తుతం జోహాన్నెస్ బర్గ్‌లో ఉన్నారు. అయితే కమల్ హాసన్ ప్రస్తుతం రిలాక్స్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. షూటింగ్ స్టార్ట్ అయ్యే లోపు విశ్రాంతి తీసుకుంటున్నారట కమల్. . విశ్రాంతి టైంలో కమల్ హాసన్ కొద్ది సేపు తనలోని మ్యూజిషియన్‌ను నిద్రలేపాడు. కమల్ క్రిస్టల్ బౌల్‌ను వాయిస్తున్న వీడియోను అరుణ్ విజయ్ షేర్ చేస్తూ.. ఉలగనాయగన్ మ్యూజిక్ కంపోజింగ్ అంటూ ట్వీట్ చేశాడు.
ప్రస్తుతం ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినమాలో బాబీ సింహా, సిద్దార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, సముద్రఖని లాంటి స్టార్స్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ -రెడ్ జియాంట్ మూవీస్ పై ఉదయనిధి స్టాలిన్-సుభాస్కరన్ ఇండియన్ 2 సినిమాను తెరకెక్కిస్తున్నారు. . అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.
