Asianet News TeluguAsianet News Telugu

శంకర్ పై కోపంగా కమల్ హాసన్ ఫ్యాన్స్, ఇరుక్కుపోయిన స్టార్ డైరెక్టర్

పాపం స్టార్ డైరెక్టర్ శంకర్ ఇరకాటంలో పడ్డాడు. అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు రెండు బ్యాలన్స్ చేయలేక ఫ్యాన్స్ చేత విమర్షలు ఫేస్ చేస్తున్నాడు. 

Kamal Haasan Fans Fires On Director Shankar
Author
First Published Nov 17, 2022, 9:08 AM IST

పాపం స్టార్ డైరెక్టర్ శంకర్ ఇరకాటంలో పడ్డాడు. అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు రెండు బ్యాలన్స్ చేయలేక ఫ్యాన్స్ చేత విమర్షలు ఫేస్ చేస్తున్నాడు. 

డైరెక్టర్ శంకర్ ఇరకాటంలో పడ్డాడు. రెండు భాషలు.. రెండు సినిమాలు.. ఇద్దరు స్టార్ హీరోలు... వాళ్ళ ఫ్యాన్స్. రెండు వైపుల నుంచి ప్రెజర్ తో పాటు.. విమర్షల బాణాలు పడుతుండటంతో తప్పించుకోలేక ఇబ్బంది పడుతున్నారు. తాజాగా కమల్ హాసన్ ఫ్యాన్స్ ఈ స్టార్ డైరెక్టర్ పై గుర్రుగా ఉన్నారట. ఎందుకంటే..? 

ఇండియా మూవీ లవర్స్‌ ఎంతో ఇంట్రెస్ట్ గా ఎదురుచూస్తున్న సినిమాల్లో  ఇండియన్ 2 ఒకటి. క‌మ‌ల్ హాస‌న్ , శంక‌ర్  కాంబినేషన్‌ లో వస్తున్న ఈ సినిమా భారీ అంచనాలతో తెరకెక్కుతోంది. ఈ సినిమా డైరెక్టర్ శంకర్ కు తిప్పలు తప్పడం లేదు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న భారతీయుడు 2 సినిమా వివాదాల కారణంగా మొదట్లోనే ఆగిపోయింది. ఈమూవీ ఇక తెరకెక్కుతుందా లేదా అన్న అనుమానాలు పెరగడంతో.. శంకర్ ఇంకో సినిమా కమిట్ అయ్యారు. 

తెలుగు సినిమాకు ప్రపంచ స్థాయి గర్తింపు రావడంతో... ఎప్పుడూ తెలుగు సినిమా వైపు చూడని శంకర్ డైరెక్ట్ తెలుగు సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో పాన్ఇండియా మూవీ స్టార్ట్ చేశాడు. దాదాపుసినిమా 60 పర్సంట్ కంప్లీట్ అయిన తరువాత.. అటు భారతీయుడు2 సినిమా షూటింగ్ కు లైన్ క్లియర్ అయ్యింది. ఇక అటు తప్పక వెళ్లాల్సిన పరిస్థితుల్లో.. చరణ్ సినిమాకు బ్రేక్ ఇచ్చి ఇండియన్ 2 సినిమా షూటింగ్ కు వెళ్లిపోయాడు. 

దాంతో చరణ్ ఫ్యాన్స్ శంకర్ పై ఫైర్ అయ్యారు. సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ చేసుకుంటూ వచ్చి... పూర్తి అయ్యే టైమ్ లో ఎలా వదిలేసి వెళ్తారు అంటూ విమర్షలు గుప్పించారు. చరణ్ మాత్రం ఈ బ్రేక్ ను బాగా ఉపయోగించుకున్నాడు. జపాన్ లో ట్రిపుల్ ఆర్ రిలీజ్ ప్రమోషన్ తో పాటు.. భార్య ఉపాసనతో టూర్ కంప్లీట్ చేసుకుని వచ్చాడు. అయితే ఇప్పుడు శంకర్ భారతీయుడు2 మూవీ షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి.. చరణ్ సినిమా కంప్లీట్ చేయడానికి వచ్చేశాడట. 

ఇంకా 60-70 రోజులు అయితే భారతీయుడు2 షూటింగ్  పూర్తతుంది అనుకున్నటైమ్ లో చరణ్ మయూవీ షూటింగ్ ప్లాన్ చేశాడట శంకర్. న్యూజిలాండ్ లో భారీ షెడ్యూల్ ను చేయబోతున్నట్టు తెలుస్తోంది. అటు  ఇండియన్‌ 2 చిత్రీకరణకు బ్రేక్ ఇచ్చి.. ఇటు రావడంతో.. కమల్ ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారట. ముందు మన సినిమా చూసుకోకుండా అటు ఎలా వెళ్తారు అంటూ మండిపడుతున్నట్టు టాక్ నడుస్తుంది. దీంతో ఎటు చెప్పుకోలేక శంకర్ కాస్త స్ట్రెస్ ఫీల్ అవుతున్నట్టు సమాచారం. 

అయితే ప్రస్తుతం శంకర్‌ టాలీవుడ్‌ స్టార్ హీరో రాంచరణ్‌తో చేస్తున్న ఆర్‌సీ 15 విదేశీ షెడ్యూల్‌ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. మరి ఇండియన్‌ 2 షూటింగ్‌ను శంకర్‌ ఎప్పుడు పూర్తి చేస్తాడన్నది సస్పెన్స్ గా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో శంకర్‌ ఓ వైపు ఇండియన్‌ 2ను మరోవైపు ఆర్‌సీ 15 సినిమాలను ఎలా బ్యాలెన్స్ చేస్తాడోనని తెగ ఆలోచిస్తున్నారు సినీ జనాలు. ఇండియన్‌ 2 వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ చిత్రంలో కాజ‌ల్ అగ‌ర్వాల్ , ర‌కుల్ ప్రీత్ సింగ్, ప్రియా భ‌వానీ శంక‌ర్‌, బాబీ సింహా, సిద్దార్థ్, స‌ముద్రఖని, వెన్నెల కిశోర్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. లైకా ప్రొడ‌క్షన్స్‌ -రెడ్ జియాంట్ మూవీస్ బ్యానర్లపై ఉద‌య‌నిధి స్టాలిన్‌-సుభాస్కరన్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ ర‌విచంద‌ర్ మ్యూజిక్ డైరెక్టర్‌‌. ఇప్పటికే విడుదలైన ఇండియన్‌ 2 పోస్టర్‌ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది.

Follow Us:
Download App:
  • android
  • ios