యూనివర్సల్‌ యాక్టర్‌ కమల్‌ హాసన్‌ అభిమాని, తన అభిమాన హీరోపై ఉన్న ప్రేమని చాటుకున్నారు. ఆయన నటిస్తున్న `విక్రమ్‌` సినిమా టికెట్లని భారీగా కొనుగోలు చేసి షాకిచ్చాడు.

లోకనాయకుడు కమల్‌ హాసన్‌ నటిస్తున్న యాక్షన్‌ మూవీ `విక్రమ్‌`. ఆద్యంతం యాక్షన్‌ ప్రధానంగా సాగే చిత్రంలో విజయ్‌ సేతుపతి, ఫహద్‌ ఫాజిల్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సూర్య గెస్ట్ రోల్‌ చేస్తున్నారు. `ఖైదీ` ఫేమ్‌ లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమా జూన్‌ 3న విడుదల కాబోతుంది. రాజ్‌కమల్‌ ఫిల్మ్స్ పై కమల్‌ హాసన్‌ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో శ్రేష్ఠ్‌ మూవీస్‌ పతాకంపై హీరో నితిన్‌ రిలీజ్‌ చేస్తున్నారు. తాజాగా ఈ మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లో ఈ చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ జరుగుతుంది. ఇందులో వెంకటేష్‌ గెస్ట్ గా పాల్గొంటున్నారు. అలాగే నితిన్‌ కూడా పాల్గొననున్నారు. 

ఇదిలా ఉంటే కమల్‌ హాసన్‌ కి భాషలకు అతీతంగా అభిమానులున్నారు. హిట్‌, ఫ్లాప్‌లకు అతీతంగా హీరోని ఆరాధించే అభిమానులు ఆయన సొంతం. తన అరవైఏళ్ల సినీ జీవితంలో ఎన్నో మైలు రాళ్లు అందుకున్న ఆయన్ని అభిమానించే వారి అభిమానం వెలకట్టలేనిది. మన తెలుగులోనూ ఆయన సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో ఇక్కడ కూడా మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది కమల్‌ హాసన్‌కి. తాజాగా హైదరాబాద్‌కి చెందిన అభిమాని ఒకరు తన అభిమానాన్ని చాటుకున్నారు. జూన్‌ 3న విడుదల కాబోతున్న `విక్రమ్‌` సినిమా టికెట్లు ముందుగానే కొన్నారు. 

ముందుగా సినిమా టికెట్లు కొనడంలో పెద్ద విశేషం లేదు. కానీ ఆయన ఒక్కడే ఏకంగా ఆరవై టికెట్లు కొనుగోలు చేయడం విశేషం. హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ఐమాక్స్ లో ఆయన టికెట్లు కొనుగోలు చేశారు. కమల్‌ హాసన్‌పై ఉన్న అభిమానంతోనే ఇన్ని టికెట్లు కొన్నట్టు చెప్పారు సదరు అభిమాని. ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఆయన ట్విట్టర్‌ ద్వారా పోస్ట్ చేశారు. ఇందులో తన ఇంట్లో బెడ్‌పై పడుకుని సినిమా టికెట్లని లవ్‌ షేప్‌లో పరిచి పై నుంచి ఫోటో దిగారు. ఆ ఫోటోని షేర్‌ చేస్తూ, 60 టికెట్లు శుక్రవారం ఐమాక్స్ `విక్రమ్‌` మూవీ అని పేర్కొంటూ తన ఆనందాన్ని పంచుకున్నాడు. దీంతో ఆయనకు నెటిజన్ల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. నిజమైన అభిమానం, రియల్‌ లవ్‌ అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

Scroll to load tweet…