రీసెంట్ గా రజనీతో   2.0 తో సంచలనం సృష్టించిన దర్శకుడు శంకర్‌ తన తదుపరి చిత్రం కమల్ తో ప్రారంభించాడు. కమల్‌ హాసన్‌ హీరోగా ఇప్పటికే  లాంచనంగా ప్రారంభమైన భారతీయుడు 2 సినిమా ఈ నెల రెండో వారం  రెగ్యులర్‌ షూటింగ్‌ను  ప్రారంభం అవుతుందని ప్రకటించారు.   కొత్త ఏడాది జనవరిలో భారతీయుడు 2 షూటింగ్‌ను చెన్నైలో ప్రారంభించేందుకు సన్నాహాలు మొదలయ్యాయి..కానీ అనుకోని అవాంతరం ఏర్పడింది. దాంతో షూటింగ్ కాన్సిల్ చేసినట్లు సమాచారం. అందుతున్న సమాచారం ప్రకారం కమల్ కు ముఖంపై రాషెష్ రావటంతో కాన్సిల్ చేసినట్లు తెలుస్తోంది.

వేర్వేరు ప్రదేశాలకు వెళ్ళటం, ఇన్ఫిక్షన్ రావటంతో ఆయన ముఖంపై చేతులపై ఎర్రటి మార్క్ లుగా వచ్చాయి. ఆ రాషెష్ పోయేందుకు ట్రీట్మంట్ తీసుకుంటన్నానని, షూటింగ్ ని పోస్ట్ ఫోన్ చేయమని అడిగినట్లు సమాచారం. దాంతో జనవరిలో అనుకున్న షూటింగ్ కాన్సిల్ చేసి పిభ్రవరి నుంచి షూటింగ్ కంటిన్యూ చేయనున్నారని చెన్నై సినీ వర్గాల సమాచారం. ఎట్టిపరిస్దితుల్లోనూ ఈ సినిమా మిస్ పైర్ అవ్వకూడదని, తన రాజకీయ భవిష్యత్ కు ఈ సినిమా ఉపయోగపడాలని కమల్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

చెన్నైలో షూటింగ్ తరువాత పొల్లాచ్చిలో మరో షెడ్యూల్‌ను పూర్తి చేసి మేజర్‌ షెడ్యూల్‌ కోసం ఉక్రెయిన్‌ వెళ్లేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. అనుకున్న ప్రకారం షూటింగ్ పూర్తయితే 2020 జనవరిలో భారతీయుడు 2 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసినిమా తరువాత కమల్‌ పూర్తిగా సినిమాలకు గుడ్‌బై చెప్పునున్నారన్న ప్రచారం జరుగుతుండటంతో భారతీయుడు 2 భారీ హైప్‌ క్రియేట్‌ అయ్యింది.

ఈ సినిమా కోసం కాజల్‌ అగర్వాల్‌ కేరళ మార్షల్‌ ఆర్ట్‌ కలరి పయ్యట్టు నేర్చుకోనున్నారు. కమల్‌ కనిపించనున్న పాత్రల్లో తాత పాత్ర ఒకటి. దీని కోసం కమల్‌హాసన్‌ బరువు తగ్గారు కూడా. ఈ సినిమా బడ్జెట్‌ విషయంలో అస్సలు కాంప్రమైజ్‌ కాకూడదని దర్శకుడు శంకర్‌ ఫిక్స్‌ అయినట్టున్నారు.