రూ.15 కోట్లతో లగ్జరీ ఫ్లాట్ కొన్న కమల్ హాసన్ చిన్న కూతురు.. అక్షర హాసన్ కి అంత డబ్బు ఎక్కడిదో ?
కమల్ హాసన్ నట వారసురాలిగా శృతి హాసన్ చిత్ర పరిశ్రమలో రాణిస్తోంది. శృతి హాసన్ ఇప్పుడు సౌత్ లో స్టార్ హీరోయిన్. అలాగే కమల్ చిన్నకూతురు అక్షర హాసన్ కూడా నటిగా మారింది.

కమల్ హాసన్ నట వారసురాలిగా శృతి హాసన్ చిత్ర పరిశ్రమలో రాణిస్తోంది. శృతి హాసన్ ఇప్పుడు సౌత్ లో స్టార్ హీరోయిన్. అలాగే కమల్ చిన్నకూతురు అక్షర హాసన్ కూడా నటిగా మారింది. శృతి హాసన్ స్థాయిలో అక్షర స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. కానీ విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ నటిగా గుర్తింపు పొందే ప్రయత్నం చేస్తోంది.
అక్షర హాసన్ చివరగా 'అచ్చం మడం నాణం పయిర్పు’ అనే చిత్రంలో నటించింది. ప్రస్తుతం అక్షర హాసన్ మరిన్ని అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. అక్షర హాసన్ క్యూట్ లుక్స్ తో మురిపించడం చూస్తూనే ఉన్నాం.
అయితే అక్షర హాసన్ గురించి ముంబైలో ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. భారీ మొత్తంలో ఆమె కోట్లాది రూపాయలు వెచ్చించి ముంబైలో లగ్జరీ అపార్ట్మెంట్ ని కొనుగోలు చేసిందట. ఏకంగా రూ15 కోట్లు వెచ్చించి 2245 చదరపు అడుగుల విస్తీరణం కలిగిన అపార్ట్మెంట్ ని అక్షర హాసన్ సొంతం చేసుకున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఖర్ ప్రాంతంలోని 16 రోడ్ లో ఈ ఫ్లాట్ ఉన్నట్లు తెలుస్తోంది. అటాచ్డ్ బాల్కనీ, మూడు కారు పార్కింగ్ స్పేస్ లు కలిగిన అపార్ట్ మెంట్ ని అక్షర సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 27నే దీనికి సంబందించిన రిజిస్ట్రేషన్ పనులు పూర్తయ్యాయట. రిజిస్ట్రేషన్ కోసం అక్షర 94 లక్షలు స్టాంప్ డ్యూటీ చెల్లించినట్లు తెలుస్తోంది.
అక్షర హాసన్ ఇంతటి లగ్జరీ ఫ్లాట్ ని సొంతం చేసుకోవడంతో అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే శృతి హాసన్ ఇలాంటి ఫ్లాట్ కొంటె ఎలాంటి ఆశ్చర్యం ఉండదు. కానీ అక్షర హాసన్ కి ఇంత భారీ మొత్తంలో డబ్బు ఎక్కడిది అంటూ నెటిజన్ల మధ్య చర్చ జరుగుతోంది. అక్షర హాసన్ రెమ్యునరేషన్ ఆ స్థాయిలో ఉండదు. అంత మొత్తంలో డబ్బు ఆమె తండ్రి నుంచి తీసుకుందా అని కామెంట్స్, సందేహాలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉండగా శృతి, అక్షర హాసన్ లు కమల్ రెండవ భార్య సారిక సంతానం. కమల్, సారిక విడిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ తల్లితో ముంబైలోనే ఉంటున్నారు. అయితే శృతి మాత్రం తరచుగా తండ్రి వద్దకు చెన్నె వెళ్లి వస్తూ ఉంటుంది. కోలీవుడ్ లో శృతి పలు చిత్రాలు చేస్తోంది కాబట్టి ఎక్కువగా తండ్రితో ఉంటుంది. ఇక అక్షర కూడా అప్పుడప్పుడూ తండ్రి వద్దకు వెళుతూ ఉంటుంది.