నటుడు కమల్ హాసన్ ఇప్పుడు రాజకీయాలకు కాస్త బ్రేక్ ఇచ్చి షూటింగ్ లతో బిజీ అయిపోయారు. లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థుల విజయం కోసం ప్రచారం చేసిన కమల్ హాసన్ ఇప్పుడు శాసన సభ ఉపఎన్నికల కోసం సిద్ధమవుతున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ ఆయన సినిమా, టీవీ షూటింగ్ లంటూ బిజీ అయిపోయారు. కమల్ హాసన్ వ్యాఖ్యాతగా బిగ్ బాస్ రియాలిటీ గేమ్ షోని నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తమిళంలో రెండు సీజన్ లను హోస్ట్ చేసిన ఆయన మూడో సీజన్ కి రెడీ అయిపోతున్నారు. 

ప్రస్తుతం దీనికి సంబంధించిన ఏర్పాటు జరుగుతున్నాయి. అందులో భాగంగా సీజన్ 3 ప్రోమో షూటింగ్ చెన్నైలో బుధ, గురువారాల్లో జరిగింది. అందులో కమల్ హాసన్ పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ సీజన్ లో పాల్గొనబోయే పోటీదారులను ఎంపిక చేస్తున్నారు. జూన్ నెల రెండో వారం నుండి ఈ కార్యక్రమం టీవీలో ప్రసారం కానుంది.