KH237: కమల్‌ హాసన్‌ కొత్త సినిమా.. `KGF` ఫైట్‌ మాస్టర్లతో మూవీ..

ఇప్పటికే నాలుగు సినిమాలు చేతిలో ఉన్న కమల్‌ హాసన్‌..ఇప్పుడు మరో మూవీని ప్రకటించారు. ఫైట్‌ మాస్టర్లని దర్శకులుగా పరిచయం చేస్తూ మూవీ చేయబోతున్నారు.

kamal haasan announces his one more new film KH237 with fight masters details arj

కమల్‌ హాసన్‌ చేతిలో ఇప్పటికే నాలుగైదు ప్రాజెక్టులున్నాయి. తాజాగా మరో సినిమాని ప్రకటించారు. అయితే అనూహ్యంగా ఓ క్రేజీ ప్రాజెక్ట్ ని ప్రకటించారు. ఫైట్‌ మాస్టర్లతో మూవీ చేస్తున్నాడు కమల్‌. పాపులర్‌ ఫైట్‌ మాస్టర్లు అన్భరివ్‌ (అన్బుమణి, అరివుమణి)లను దర్శకులుగా పరిచయం చేయబోతున్నారు. కవల ఫైట్‌ మాస్టర్లుగా ఇటీవల పాపులర్ అయ్యారీద్దరు. రామ్‌ లక్ష్మణ్‌ తరహాలో రాణిస్తున్నారు. `కేజీఎఫ్‌`, `విక్రమ్‌`, `లియో`, `దసరా` వంటి చిత్రాలు పనిచేశారు. ఇప్పుడు `కల్కి`, `ఇండియన్‌ 2`, `గేమ్‌ ఛేంజర్‌` వంటి సినిమాలకు వీరు పనిచేస్తున్నారు.

కమల్‌ తన రాజ్‌ కమల్‌ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ ద్వారా ఈ మూవీని చేస్తున్నారు. తాజాగా శుక్రవారం ఈ మూవీని అధికారికంగా ప్రకటించారు. `కేహెచ్‌237` ప్రాజెక్ట్ గా ఇది తెరకెక్కబోతుంది. ప్రస్తుతం ఈ ఇద్దరు కమల్‌ చేస్తున్న `థగ్‌ లైఫ్‌`కి కూడా వర్క్ చేస్తున్నారు. స్టయిలీస్‌ అండ్‌ మాస్‌ యాక్షన్‌ కొరియోగ్రఫీ చేయడంలో అన్బరివ్‌ చాలా తోపు. దీంతో ఇటీవల బాగా పాపులర్‌ అయ్యారు. సౌత్‌లో టాప్‌ లో ఉన్నారు. ఈ ఇద్దరు ఇప్పుడు దర్శకులుగా మారడం ఆశ్చర్యపరుస్తుంది. 

ఇక కమల్‌ హాసన్‌ చివరగా `విక్రమ్‌` సినిమాతో వచ్చారు. ఇప్పుడు `ఇండియన్‌ 2`లో నటిస్తున్నారు. శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ ఇది. చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ఈ ఏడాది సమ్మర్‌లో వచ్చే అవకాశం ఉంది. దీనికి పార్ట్ 3 కూడా వస్తుందని తెలుస్తుంది. దీంతోపాటు మణిరత్నం దర్శకత్వంలో `థగ్ లైఫ్‌` మూవీ చేస్తున్నారు. దీనికి సంబంధించిన గ్లింప్స్ విడుదల చేయగా అది గూస్‌ బమ్స్ తెప్పిస్తుంది. `నాయకుడు`కి కొనసాగింపుగా ఇది ఉండబోతుందని తెలుస్తుంది. 

మరోవైపు హెచ్‌ వినోద్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ మూవీ ప్రారంభం కావాల్సి ఉంది. దీనికి సంబంధించిన గ్లింప్స్ విడుదల చేశారు. అది సైతం ఆకట్టుకుంది. ఉద్యమం నేపథ్యంలో పొలిటికల్‌ థ్రిల్లర్‌గా ఆ మూవీ ఉండబోతుందని తెలుస్తుంది. అలాగే ప్రభాస్‌ మూవీలో నటిస్తున్నారు కమల్‌. `కల్కి2898ఏడీ`లో కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇందులో ఆయనది నెగటివ్‌ రోల్‌ అని తెలుస్తుంది. ఇది గ్లోబల్ ఫిల్మ్ గా తెరకెక్కుతుంది. ఇలా కమల్‌కి ఇప్పుడు భారీ లైనప్‌ ఉందని చెప్పొచ్చు. 

Read more:శ్రీలీలకి హ్యాట్రిక్ పడింది.. త్రివిక్రమ్ ఇలా చేస్తాడనుకోలేదు.. ఇక చివరి ఆశ అదే?

Also read: కల్కి రిలీజ్ డేట్ ఫిక్స్... అదిరిన ప్రోమో!
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios