8 వేల మందితో డైరెక్టర్ శంకర్ భారీ ప్లాన్, బెజవాడలో భారతీయుడు2 షూటింగ్
ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన లోకేషన్లలో అత్యద్బుతమైన సీన్లు సృష్టిస్తాడు డైరెక్టర్ శంకర్. ప్రస్తుతం ఆయన డైెరెక్ట్ చేస్తున్న భారతీయుడు 2 షూటింగ్ ప్రపంచం అంతా షూటింగ్ చేసుకుని వచ్చి.. తాజాగా బెజవాడ చేరింది.

లోకనాయకుడు కమల్ హాసన్ మంచి ఫామ్ లో ఉన్నాడు. విక్రమ్ సినిమాతో ఆయన మళ్ళీ పుంజుకున్నాడు. ఇదే ఊపుతో కమల్ భారతీయుడు 2 సినిమాను లైన్ లో పెట్టాడు. లోక నాయకుడు.. నట కమలం.. కమల్ హాసన్ హీరోగా శంకర్ శంకర్ దర్శకత్వంలో.. వచ్చిన సూపర్ హిట్ మూవీ భారతీయుడు. ఇక ఇదే కాంబినేషన్ లో.. ఈ ఇద్దరు స్టార్లు కలిసి ఇప్పుడు భారతీయుడు సినిమాకుసీక్వెల్ చేస్తున్నారు. దాదాపు చివరి దశలో ఉంది షూటింగం. భారతీయుడు 2 గా తెరకెక్కుతోన్న.. ఈసినిమాలో సిద్దార్థ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవాని, వెన్నెల కిశోర్, బ్రహ్మానందం తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
కొన్ని కారణాల వల్ల ఈమూవీ డిలై అవుతూ వచ్చింది. కొన్నాళ్లు ఆగిపోయింది కూడా. గత కొన్నేళ్లుగా ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. ఇటీవల ఈ మూవీ డబ్బింగ్ వర్క్స్ స్టార్ట్ అయ్యాయని చెప్పడంతో షూటింగ్ చివరి దశకు వచ్చింది అంనుకున్నారు అంతా. ఇక ఈ చిత్రం షూటింగ్ ని అయితే దర్శకుడు శంకర్ వరల్డ్ వైడ్ గా అనేక ప్రాంతాల్లో తెరకెక్కిస్తుండగా లేటెస్ట్ గా భారతీయుడు టీమ్ ఆధ్రా చేరారు. ప్రతి చోట కూడా తనదైన భారీతనంతో శంకర్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.
తాజాజా ఈమూవీ షూటింగ్ బెజవాడ చేరింది. ఇక్కడ ఓ క్రేజీ సీక్వెన్స్ ను తీయ్యబోతున్నట్టుతెలుస్తోంది. ఈ షూటింగ్ కోసం 8000 వేల మంది జూనియర్ ఆర్టిస్ట్ లను తీసుకున్నట్టు సమాచారం. మరి ఈ చిత్రం ఇప్పుడు విజయవాడలో అయితే ఓ క్రేజీ సీక్వెన్స్ ని షూటింగ్ జరుపుకుంటున్నట్టుగా తెలుస్తుంది.విజయవాడలో గాంధీనగర్ పరిసర ప్రాంతాల్లో అయితే షూట్ చేస్తున్నారట. మరి ఈ షూట్ లో శంకర్ ఏకంగా 8000 వేల మంది జూనియర్ ఆర్టిస్ట్ లతో చేస్తున్నారట. దీనితో మొత్తం నాలుగు రోజులు అక్కడ బ్లాక్ చేసినట్టుగా తెలుస్తుంది. మరి శంకర్ అయితే ఏం ప్లాన్ చేసారో వేచి చూడాలి.