కమల్ హాసన్‌తో ప్రభుదేవా.. రెండు దశాబ్దాల తర్వాత `విక్రమ్`లో..?
కమల్ హాసన్, ప్రభుదేవా చివరగా 1998లో వచ్చిన `కాదలా కదలా`(నవ్వండి లవ్వండి) చిత్రంలో నటించారు. వీరిద్దరు కలిసి రెండు దశాబ్దాల తర్వాత తెరని పంచుకోబోతున్నారు. కమల్ హాసన్ తాజా చిత్రంలో ప్రభుదేవా కీలక పాత్ర పోషించనున్నట్టు తెలుస్తుంది.
విశ్వనటుడు కమల్ హాసన్‌తో కలిసి ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా స్టెప్పులేయబోతున్నారు. వీరిద్దరు కలిసి రెండు దశాబ్దాల తర్వాత తెరని పంచుకోబోతున్నారు. కమల్ హాసన్ తాజా చిత్రంలో ప్రభుదేవా కీలక పాత్ర పోషించనున్నట్టు తెలుస్తుంది. కమల్ హాసన్, ప్రభుదేవా చివరగా 1998లో వచ్చిన `కాదలా కదలా`(నవ్వండి లవ్వండి) చిత్రంలో నటించారు.
ఇప్పుడు కమల్ హాసన్.. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో `విక్రమ్` చిత్రంలో నటిస్తున్నారు. పొలిటికల్ థ్రిల్లర్ చిత్రమిది. తన రాజ్‌కమల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ పతాకంపై కమల్ హాసన్ నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాని ప్రకటించడంతోపాటు టీజర్‌ని కూడా విడుదల చేశారు. ఇది ఆద్యంతం ఆకట్టుకోవడంతోపాటు, సినిమాపై అంచనాలను భారీగా పెంచింది. ఈ సినిమాలో కీలక పాత్ర కోసం ప్రభుదేవాని తీసుకునే ఆలోచిన కమల్ ఉన్నారట. దాదాపు కన్ఫమ్ అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే 22ఏళ్ల తర్వాత వీరిద్దరు కలిసి నటించబోతున్నారని చెప్పొచ్చు.
కమల్ ఇప్పటికే `ఇండియన్ 2`లో నటిస్తున్నారు. అయితే ఇది పలు అవాంతరాల వల్ల వాయిదా పడింది. ఈ నేపథ్యంలో `విక్రమ్`ని తమిళనాడు ఎలక్షన్లకి ముందే విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇక ప్రభుదేవా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. `పోన్ మనికవెల్`, `బఘీర, `యంగ్ మంగ్ సంగ్`, `థీల్`, `ఊమై వెజిగల్` చిత్రాల్లో నటిస్తున్నారు. మరోవైపు హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా `రాధే` చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.