Asianet News TeluguAsianet News Telugu

భారతీయుడు2 టీమ్ తో సౌత్ ఆఫ్రికాకు కమల్ హాసన్, కీలక షెడ్యూల్ ప్లాన్ చేసిన శంకర్

ఫారెన్ షెడ్యూల్ కు రెడీ అవుతున్నాడు లోకనాయకుడు కమల్ హాసన్. భారతీయుడు 2 షూటింగ్ ను పరుగులు పెట్టిస్తున్నారు. భారీ షెడ్యూల్ కు ప్లాన్ చేశారు టీమ్. 
 

Kamal Haasan And Indian2 Movie Team Ready to South Africa Tour
Author
First Published Feb 4, 2023, 1:48 PM IST

ఇప్పటికే  సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ చేసుకుంటుంది భారతీయుడు2 మూవీ. రీ ఓపెన్ తరువాత ఒక షెడ్యూల్ పూర్తి కాగా త్వరలోమరో షెడ్యూల్ మొదలుపెట్టనున్నారు ఇండియన్ 2 సినిమా టీమ్. అంతే కాదు  షూటింగ్ నెక్స్ట్ షెడ్యూల్ కోసం ఆఫ్రికాకు వెళ్లనున్నారు. ఆఫ్రికా అడవుల్లో షూటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు  చేయనున్నట్టు సమాచారం. అంతే కాదు భారీ లాంగ్ షెడ్యూల్ ను ఆఫ్రికాలో ప్లాన్ చేశారట టీమ్. ఈ షెడ్యూల్ దాదాపు 15 రోజులు జరగనున్నట్టు సమాచారం. అప్పడప్పుడు ఈ మూవీకి సబంధించిన అప్ డేట్స్.. లీవ్ అవుతున్న ఫోటోస్ ఈసినిమాపై భారీగా అంచనాలు పెరిగేలా చేశాయి.  

దీంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. ఇక ఇండియన్ 2 సినిమాలో కమల్ హాసన్ తో పాటు కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్దార్థ్, బాబీ సింహ.. పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇండియన్ 2 సినిమాని 2023 చివర్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.1996లో తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా భారతీయుడు సినిమా వచ్చింది. దాదాపు 26 సంవత్సరాల తర్వాత 2022 లో ఈ సినిమాకి సీక్వెల్ మొదలుపెట్టారు. కానీ కొంత షూటింగ్ అయిన తరువాత రకరకాల కారణాల వల్ల ఈ షూట్ ఆగిపోయింది. మళ్ళీ రీసెంట్ గా షూటింగ్ ను పునప్రారంభించారు.  ఇప్పుడు ఇండియన్ 2 షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. 

ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలతో పాటు.. హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో చాలా వరకూ షూటింగ్ పూర్తి చేశారు. ఇక తమిళనాడులో  కూడా కొన్ని ప్రాంతాలలో షూటింగ్ చేసినన తరుపరి  షెడ్యూల్ కోసం ఫారెన్ టూర్ కు వెళ్లబోతున్నారు. సౌత్ స్టార్ హీరో.. తమిళ లోకనాయకుడు కమల్‌  హాసన్  ప్రస్తుతం అదరగొడుతున్నాడు. ఆ మధ్య కొన్నేళ్ల పాటు సినిమాలు కలిసిరాక ఇబ్బంది పడ్డ కమల్.. చాలా  ఏళ్ల తర్వాత విక్రమ్‌ తో గ్రాండ్‌ కంబ్యాక్‌ ఇచ్చాడు. గతేడాది జూన్‌ లో రిలీజ్ అయిన ఈ సినిమా కమల్‌ హాసన్ కెరీర్ లోనే హైయోస్ట్ కలెక్షన్స్ ను సాధించి పెట్టింది. తమిళంలో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. 

విక్రమ్ హిట్ తో జోరు పెంచాడు లోక నాయకుడు. అదే ఊపులో ఆగిపోయిన  ఇండియన్‌-2 సినిమాను కూడా పట్టాలెక్కించాడు. వరుసగా బ్రేకులిస్తూ... పూర్తిగా ఆగిపోయిన భారతీయుడు సీక్వెల్ సినిమాను గతేడాది సెప్టెంబర్‌లో రీ స్టార్ట్ చేసి పరుగులు పెట్టిస్తున్నాడు శంకర్.  మొన్నటి వరకూ ఈ సినిమా షూటింగ్‌ ఆంధ్రప్రదేశ్‌లోని జమ్మలమడుగు దగ్గరున్న గండికోటలో జరిగింది. ఈ షెడ్యూల్‌లో కమల్‌పై కీలక సన్నివేశాలను తెరకెక్కించరు. . కాగా షూటింగ్‌ స్పాట్‌లో ఉన్న కమల్‌ను చూసేందుకు అభిమానులు  భారీగా తరలి వచ్చారు.

Follow Us:
Download App:
  • android
  • ios