తన లవ్ గురించి హలో హిరోయిన్ కల్యాణి... అతన్నే పెళ్లి చేసుకుంటానంటోంది

తన లవ్ గురించి హలో హిరోయిన్ కల్యాణి... అతన్నే పెళ్లి చేసుకుంటానంటోంది

అక్కినేని అఖిల్  సరసన హలో చిత్రంలో హీరోయిన్‌గా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన కల్యాణి ప్రియదర్శన్ అందంతోనే కాక అభినయంతో కూడా మెప్పించింది. ఈ చిత్రంలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు వచ్చాయి. ఇండస్ట్రీ బ్యాక్ గ్రౌండ్ తోనే సినీ రంగంలోకి అడుగుపెట్టిన కల్యాణి ప్రియదర్శన్ ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్, ప్రముఖ నటి లిజి ముద్దుల కూతురే.

నాగార్జున, అమల నటించిన నిర్ణయం చిత్రానికి ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఇక లిజి టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఆత్మబంధువు, 20వ శతాబ్దం చిత్రంలో తన నటనతో లిజీ మెప్పించింది. పవన్, త్రివిక్రమ్ నిర్మాతలుగా రూపొందించే నితిన్‌ చిత్రంతో లిజీ మళ్లీ సెకండ్ ఇన్సింగ్స్‌ను ప్రారంభించనున్నారు.

కల్యాణి ప్రియదర్శిని హీరోయిన్‌గా మారకముందు సింగపూర్, అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం చేసింది. నటిగా మారక ముందు ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ వద్ద ఆర్ట్ డిపార్ట్‌ మెంట్‌లో వర్క్ చేసింది. హృతిక్ రోషన్ నటించిన క్రిష్ చిత్రానికి అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్‌గానూ పనిచేసింది. హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వాలనుకొన్న తర్వాత కల్యాణి భారీ కసరత్తే చేసింది. ఒకప్పుడు బొద్దుగా ఉండే కల్యాణి హిరోయిన్ కావటం కోసం నాజుగ్గా మారింది. అందంగా కనిపించడానికి దాదాపు 25 కిలోల బరువు తగ్గింది.

కల్యాణి ప్రియదర్శన్‌ కు తమిళంలో నజ్రియా, హిందీలో అలియాభట్ ఇష్టమట. ఇక మలయాళంలో మోహన్ లాల్, హిందీలో రణ్‌వీర్ సింగ్ తనకు ఫేవరేట్ హీరోలట. హీరోయిన్‌గా మారిన తర్వాత నాకు అమ్మ లిజితో నటించాలనిపిస్తోంది. అమ్మతో నటించే అవకాశం వస్తే మాత్రం అసలే వదులుకోను. తల్లితో తెర మీద కనిపించడం కంటే ఆనందం ఏమి ఉంటుంది అని కల్యాణి ప్రియదర్శన్ తెలిపింది.

పెళ్లి గురించి కూడా కల్యాణి స్పష్టమైన అవగాహనతోనే ఉంది. 2022లో తనకు ఇష్టమైన వ్యక్తిని పెళ్లాడుతానంటోంది. చాలా రోజులుగా ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్‌గా ఉంటున్న రితుల్ బ్రూస్ లీని పెళ్లాడుతానని కల్యాణి చెబుతోంది. పెళ్లి చేసుకునే వరకు అతనితోనే ప్రేమలో ఉంటానని నమ్మకంగా చెప్తోంది.

ప్రస్తుతం అఖిల్ అక్కినేనితో కలిసి నటించిన హలో చిత్రం వసూళ్ల పరంగా దూసుకెళ్తున్నది. ఈ చిత్రానికి మంచి టాక్ రావడం కల్యాణికి మంచి పేరు తెచ్చిపెట్టింది. తదుపరి ఏ ప్రాజెక్ట్ లో నటిస్తోందనే క్లారిటీ ఇంకా రాలేదు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM ENTERTAINMENT

Next page