Asianet News TeluguAsianet News Telugu

దిల్‌రాజుకి బయపడని `కళ్యాణం కమనీయం`.. రిలీజ్‌ డేట్‌లో మార్పులేదట..

దిల్‌రాజు నిర్మించిన `వారసుడు` చిత్రం రిలీజ్‌ డేట్‌ మారిన నేపథ్యంలో సంతోష్‌ శోభన్‌ నటించిన `కళ్యాణం కమనీయం` రిలీజ్‌ డేట్‌ మారుతుందనే ప్రచారం జరిగింది. కానీ ఏమాత్రం తగ్గేదెలే అని తెలిపారు దర్శకుడు.

kalyanam kamaneeyam movie release date no change confirm by makers
Author
First Published Jan 9, 2023, 6:32 PM IST

దిల్‌రాజు నిర్మించిన `వారసుడు` చిత్రం రిలీజ్‌ డేట్‌ మారింది. ఇది తెలుగులో మూడు రోజుల ఆలస్యంగా విడుదల కాబోతుంది. ఈ నెల 14న రిలీజ్‌ చేయబోతున్నట్టు నిర్మాత ఈ రోజు(సోమవారం) ప్రకటించారు. అయితే విజయ్‌ లాంటి పెద్ద హీరో సినిమా, పైగా దిల్‌రాజు సినిమా కావడంతో `కళ్యాణం కమనీయం` మూవీ వాయిదా పడుతుంది. ఒక్క రోజు వెనక్కి వెళ్తుందనే వార్తలొచ్చాయి. 

కానీ రిలీజ్‌ డేట్‌లో మార్పు లేదని వెల్లడించింది చిత్ర బృందం. చిత్ర దర్శకుడు అనిల్‌ కుమార్‌ ఆళ్ల ఈ విషయాన్ని స్పష్టం చేశారు. సోమవారం ఆయన మీడియాతో ముచ్చటించారు. ఈ సినిమాని యూవీ కాన్సెప్ట్స్ నిర్మించింది. కంప్లీట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందింది. సంతోష్‌ శోభన్‌, ప్రియా భవానీ శంకర్‌ జంటగా నటించారు. సినిమా ఈ నెల 14న విడుదల కానుంది. ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ, సెంటిమెంట్స్‌ మేళవింపుగా ఉంటుందని చిత్ర బృందం వెల్లడించింది. 

ఈ సినిమా గురించి దర్శకుడు చెబుతూ, `పెళ్లయ్యాక భర్తకు జాబ్ లేకుంటే భార్య ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటుంది అనేది ఈ చిత్రంలో చూపిస్తున్నాం. అయితే అదొక్కటే కాదు ట్రైలర్ లో రివీల్ చేయని చాలా అంశాలు సినిమాలో ఉంటాయి. ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న యువ జంటగా సంతోష్ శోభన్, ప్రియ భవానీ శంకర్ నటించారు. శివ శృతి పాత్రల్లో వారి నటన మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. శృతి పాత్రలో ఫ్రెష్ ఫేస్ అయితే బాగుంటుందని ప్రియ భవానీ శంకర్ ను తీసుకున్నాం. ఎందుకంటే ఈ క్యారెక్టర్ టీనేజ్ హీరోయిన్ బాగుండదు. కొంత పరిణితి గల అమ్మాయిలా కనిపించాలి. శృతి క్యారెక్టర్ ను ప్రియ పర్పెక్ట్ గా పర్మార్మ్ చేసింది. తమ చుట్టూ జరిగే ఈగో గేమ్స్ ను ఈ యువ జంట ఎలా ఎదుర్కొన్నారనేది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.

యూవీ లాంటి పెద్ద సంస్థలో తొలి చిత్రానికి దర్శకత్వం వహించడం అదృష్టంగా భావిస్తున్నాను. సంక్రాంతికి స్టార్స్ సినిమాలు విడుదలవుతున్నాయి. అయినా మా కంటెంట్ మీద నమ్మకం ఉంది. అందుకే వెనక్కి తగ్గడం లేదు. సినిమా చూసిన సెన్సార్ వారు కూడా మీరు క్లీన్ యూ సర్టిఫికెట్ తీసుకోమని సజెస్ట్ చేశారు. వాళ్లకూ అంత బాగా నచ్చింది. క్లీన్ యూ సినిమా చేసినందుకు గర్వపడుతున్నాం.

పెళ్లైన తర్వాత మన జీవితాల్లో జరిగే ప్రతి సందర్భం కొత్తదే. అలా ఓ యువ జంట తమ వైవాహిక జీవితం ప్రారంభమయ్యాక ఎలాంటి కొత్త పరిస్థితులు ఎదుర్కొన్నారు. వాటి నుంచే ఏం నేర్చుకున్నారు, మళ్లీ ఆ తప్పులు చేయకుండా ఎలా సరిదిద్దుకున్నారు అనేది అన్ని ఎమోషన్స్ తో సినిమాలో చూస్తారు. మన సొసైటీలో అమ్మాయి ఫీలింగ్స్ ను మా కథ ప్రతిబింబిస్తుంది. - నా దృష్టిలో సినిమా అంటే మనల్ని మనం పోల్చుకోవాలి. "కళ్యాణం కమనీయం"  అలా రిలేటబుల్ మూవీ. నా జీవితంలో జరిగిన కొన్ని వాస్తవ ఘటనలు కూడా కథకు స్ఫూర్తినిచ్చాయి. అలా ఎవరి జీవితంలోనైనా ఇలాంటి సందర్భాలు ఎదురుకావొచ్చు` అని వెల్లడించారు దర్శకుడు.

Follow Us:
Download App:
  • android
  • ios