నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ఇటీవల గ్యాప్ లేకుండా కొత్త కథలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ఒకదానికోటి సంబంధం లేకుండా డిఫరెంట్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటున్న కళ్యాణ్ రామ్ నేడు 41వ పూట్టినరోజును జరుపుకోబోతున్నాడు. ఈ స్పెషల్ డే రోజు అభిమానులకు తన కొత్త సినిమా టైటిల్ పోస్టర్ తో మంచి కిక్ ఇచ్చాడు. 

సతీష్ వేగేశ్న డైరెక్షన్ లో చేస్తోన్న సినిమాకు "ఎంత మంచివాడవురా" అనే టైటిల్ ను సెట్ చేశారు. గతంలో ఎప్పుడు లేని విధంగా కళ్యాణ్ రామ్ ఒక సరికొత్త ఎమోషనల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో రాబోతున్నట్లు తెలుస్తోంది. శతమానం భవతి  మూవీతో మెప్పించిన సతీష్ శ్రీనివాస కళ్యాణం సినిమాతో కాస్త తడబడ్డాడు. 

ఇక ఆయన స్టైల్ లోనే ఈ సారి ఫ్యామిలీ ఆడియెన్స్ ని ఎలాగైనా ఆకట్టుకోవాలని ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా ద్వారా ప్రముఖ మ్యూజిక్ సంస్థ ఆదిత్య మ్యూజిక్ వారు ప్రొడక్షన్ హౌస్ లోకి అడుగుపెట్టబోతున్నారు. ఉమేష్ గుప్తా నిర్మిస్తున్న ఈ సినిమాకు గోపి సుందర్ మ్యూజిక్ అందించనున్నారు.