నందమూరి హీరో కళ్యాణ్ రామ్ గత కొన్నేళ్లుగా బాక్స్ ఆఫీస్ హిట్ కోసం చాలానే కష్టపడుతున్నాడు. పటాస్ తరువాత ఇంతవరకు సరైన హిట్ అందుకోలేదు. చివరగా 118తో ప్రయోగం చేసి నీరాశపరిచిన కళ్యాణ్ రామ్ ఇప్పుడు మూడు డిఫరెంట్ సినిమాలతో సిద్దమవుతున్నాడు. 

మల్లాది వశిష్ట్ అనే దర్శకుడితో తుగ్లక్ అనే సోషియో ఫాంటసీ సినిమా చేస్తోన్న కళ్యాణ్ రామ్ విరించి వర్మ దర్శకత్వంలో మరొక ఎమోషనల్ లవ్ స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక రీసెంట్ గా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సాగే మరో కథకు ఒకే చెప్పాడు. శతమానం భవతి వంటి సినిమాతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న సతీష్ వేగేశ్న ఆ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు. 

త్వరలోనే ఈ మూడు సినిమాలను పూర్తి చేసి బ్యాక్ టూ బ్యాక్ రిలీజ్ తో హ్యాట్రిక్ హిట్ అందుకోవాలని కళ్యాణ్ రామ్ ప్లాన్ చేస్తున్నాడు. అలాగే కేమరో రెండు కథలను కూడా ఒకే చేసిన ఈ నందమూరి హీరో వచ్చే ఏడాది వాటిని సెట్స్ పైకి తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నట్లు టాక్.