ఆ మధ్యన ఉగాది రోజు .. నందమూరి కళ్యాణ్‌రామ్‌  హీరోగా, ప్రఖ్యాత నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ త్వరలో ఒక చిత్రాన్ని ప్రారంభించనుందంటూ వార్తలు వచ్చాయి. ప్రముఖ నిర్మాత "జెమినీ" కిరణ్ నిర్మించనున్న ఈ చిత్రానికి "ఉయ్యాలా జంపాల, మజ్ను" ఫేమ్ విరించి వర్మ దర్శకత్వం వహిస్తారు అని మీడియాకు తెలియచేసారు. ఈ సంవత్సరం ద్వితీయ భాగం లో ఈ చిత్రం సెట్స్ మీద కు వెళ్తుంది అని నిర్మాణ సంస్థ అఫీషియల్ గానే తెలిపింది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం జెమినీ కిరణ్ ఆ ప్రాజెక్టుని ప్రక్కన పెట్టేసారు. 

అయితే  ఇప్పుడు వేరే నిర్మాతలు (హారిక అండ్ హాసిని క్రియేషన్స్) ఈ ప్రాజెక్టుని భుజాన వేసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు కళ్యాణ్ రామ్ తో మాట్లాడారని, బడ్జెట్  కంట్రోల్ లో సినిమా చేయటానికి విరించి వర్మ ఓకే అన్నాడని చెప్తున్నారు. పూర్తి కుటుంబ కధా చిత్రంగా రూపొందే ఈ చిత్రం త్వరలోనే లాంచ్ కానుంది. ఇప్పటిదాకా కళ్యాణ్ రామ్ చేసిన సినిమాలకు భిన్నంగా ఈ సినిమా ఉండనుంది.  ఇతర నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియజేయబడతాయి.

ప్రస్తుతం కళ్యాణ్ రామ్...  118 అనే చిత్రం చేస్తున్నారు. నివేథా థామస్, షాలినీ పాండే హీరోయిన్. ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ కె.వి.గుహన్‌ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా తెలుగుకి పరిచయం అవుతున్నారు. ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై మహేశ్‌ కోనేరు నిర్మిస్తున్నారు.

మహేశ్‌ కోనేరు మాట్లాడుతూ– ‘‘స్టైలిష్‌ యాక్షన్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రం ‘118’. కథ, కథనంతో పాటు యాక్షన్‌ పార్ట్‌కు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. కల్యాణ్‌ రామ్‌గారు ఇప్పటి వరకు చేయనటువంటి సరికొత్త పాత్రలో ప్రేక్షకులను మెప్పించనున్నారు.

కె.వి.గుహన్‌గారు ఈ చిత్రంతో టాలీవుడ్‌కి డైరెక్టర్‌గా పరిచయం కావడంతో పాటు సినిమాటోగ్రఫీ కూడా చేశారు. ప్రస్తుతం మా సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. జనవరి ద్వితీయార్ధంలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శేఖర్‌ చంద్ర.