వరుసగా భారీబడ్జెట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తోన్న కుర్ర హీరో బెల్లంకొండ శ్రీనివాస్. యాక్షన్ కథలతోనే ఎక్కువగా ప్రయోగాలు చేస్తోన్న ఈ  హీరో సరైన సక్సెస్ మాత్రం అందుకోవడం లేదు. సినిమాలు ఎన్ని వచ్చినా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద తేడా ఏమి కనిపించడం లేదు. రీసెంట్ గా వచ్చిన కవచం కూడా నెగిటివ్ టాక్ ను తెచ్చుకుంది. 

అసలైతే కవచం సినిమా సక్సెస్ అవుతుందని రిలీజ్ కు ముందు చిత్ర యూనిట్ గట్టి నమ్మకంతో చెప్పింది. కథానాయకుడు బెల్లకొండ శ్రీనివాస్ కూడా ఎన్నో ఆశలతో ఈ సినిమా చేశాడు. కానీ సినిమా ఊహించని ఫలితాన్ని ఇచ్చింది. పోలీస్ పాత్ర కావడంతో కథ వినగానే శ్రీనివాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అయితే ముందు ఈ కథ కళ్యాణ్ రామ్ దగ్గరకు వెళ్లిందట. 

దర్శకుడు శ్రీనివాస్ మామిళ్ల కథ చెప్పిన విధానం బాగా నచ్చి కొన్ని రోజుల వరకు కళ్యాణ్ రామ్ వెయిటింగ్ లిస్ట్ లో పెట్టాడట. కానీ చివరికి నందమూరి హీరో చేయలేనని చెప్పడంతో బెల్లకొండ దగ్గరికి వెళ్లినట్లు తెలుస్తోంది. చాలా వరకు కథలు విన్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి. 

కానీ సెట్స్ పైకి వచ్చేసరికి వాటి అసలు వాల్యూ తెలుస్తుంది. అప్పుడు ఎంత ఆలోచించినా లాభం ఉండదు. ఆ విధంగా కాకుండా కథ విన్నప్పుడే అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనే పాయింట్ ను పసిగట్టే ఆలోచన ఉండాలి. ఈ మధ్య వరుస అపజయాలతో మళ్ళీ డీలా పడ్డ కళ్యాణ్ రామ్ అంత త్వరగా ఏ కథలను ఒకే చేయడం లేదని వినికిడి.