నందమూరి కళ్యాణ్ రామ్ తన సినిమా కోసం ఓ పవర్ ఫుల్ టైటిల్ ని ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. అదే 'రావణ'.. మల్లిడి వసిష్ఠ అనే కొత్త దర్శకుడు కళ్యాణ్ రామ్ తో సినిమా చేయాలనుకుంటున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా కథ ఫైనల్ స్టేజ్ లో ఉంది.

కాస్త ఎక్కువ బడ్జెట్ తో సినిమాను రూపొందించాలను భావిస్తున్నారు. ఈ సినిమా కథకు 'రావణ' అనే టైటిల్ అయితే యాపట్ ఉంటుందని యూనిట్ వర్గాలు భావిస్తున్నాయి. గతంలో ఈ సినిమాకి 'తుగ్లక్' అనే టైటిల్ అనుకున్నారు. 

కానీ మేకింగ్ పరంగా కొన్ని సమస్యలు వస్తాయని.. మాస్ ఆడియన్స్ కి 'తుగ్లక్' అనే టైటిల్ పెద్దగా రీచ్ అవ్వడాని భావించి 'రావణ'కి ఫిక్స్ అయినట్లు చెబుతున్నారు. ఈ టైటిల్ ని పెట్టడం ద్వారా సినిమా మేకింగ్ లో భారీతనం కనిపించేలా చేయడానికి వీలుగా ఉంటుందని భావిస్తున్నారు.

త్వరలోనే 'రావణ' అనే టైటిల్ తో కళ్యాణ్ రామ్ సినిమా అనౌన్స్మెంట్ ఉంటుందని తెలుస్తోంది. ఇటీవల '118' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కళ్యాణ్ రామ్ ప్రస్తుతం ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఇది మధ్యలో ఉండగానే 'రావణ' సినిమా మొదలుపెడతారని సమాచారం.