Asianet News TeluguAsianet News Telugu

ఇంట్రెస్టింగ్ గా బింబిసార షూటింగ్... మేకింగ్ వీడియో రిలీజ్ చేసిన టీమ్

సూపర్ సక్సెస్ తో దూసుకుపోతుంది కల్యాణ్ రామ్ బింబిసార సినిమా. ఈ సినిమా నుంచి ఆడియన్స్ కోసం ఇంట్రెస్టింగ్ గా మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. 
 

Kalyan Ram Bimbisara Movie Making Video Viral
Author
Hyderabad, First Published Aug 16, 2022, 2:04 PM IST

నందమూరి హీరో కల్యాణ్ రామ్ హీరోగా.. కొత్త దర్శకుడు  వశిష్ఠ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా బింబిసార.  ఈ నెల 5న రిలీజ్ అయిన ఈ సినిమా అనుకున్నదానికంటే.. ఎక్కువ రిజల్ట్ ను సాధించి కల్యాణ్ రామ్ ను దిల్ ఖుష్ చేసింది. ఇక కల్యాణ్ రామ్ సొంత బ్యానర్లో నిర్మించిన ఈ సినిమా తొలి రోజునే హిట్ టాక్ తెచ్చుకుంది. ఆతరువాత నుంచి మౌత్ పబ్లిసిటీతోనే ఈ సినిమా దూసుకుపోతుంది. 

ఈ సినిమా బిబిసారుడి కథ అనుకున్నారంతా.. కాని ఇది సోషియో ఫాంటసీ మూవీ అని తెలియడంతో సినిమాపై ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. రెండు కాలాలకు సంబంధించిన  కథను ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ పెరిగేలా...  ఆసక్తికరంగా ముందుకు నడిపించడంలో డైరెక్టర్  వశిష్ఠ మొదటి ప్రయత్నంలోనే సక్సెస్ అయ్యాడు. మొదటి సినిమానే ఈ స్థాయిలో తీశాడంటే ఈ తరహా సినిమాలను మున్ముందు మరో రేంజ్ లో చేయగలడనే అభిప్రాయాలు  ఇండస్ట్రీలో వ్యాక్తం అవుతున్నాయి.

ఇక ఈ సినిమా సక్సెస్ జోష్ ను ఎంజాయ్ చేస్తున్నారు కల్యాణ్ రామ్ అండ్ టీమ్. ఈ నేపథ్యంలోనే బింబిసార నుంచి ఒక్కొక్క అప్ డేట్ ను రిలీజ్ చేస్తున్నారు. ఈరోజు బింబిసార నుంచి మూవీ  టీమ్ మేకింగ్ వీడియోను విడుదల చేసింది. ఈ సినిమా కోసం సెట్స్ ఎలా నిర్మించారు. ఇతర నిర్మాణాలు.. డాన్సులు .. ఫైట్లు కంపోజ్ చేస్తున్న సన్నివేశాలకి  సంబంధించిన షూటింగ్  షాట్స్ పై మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. 

 

ఈ మేకింక్ వీడియోకు  రెస్సాన్స్ అద్భుతంగా వస్తోంది. ఇక బింబిసార సినిమా మన దగ్గరే కాకుండా ఓవర్సీస్ లోను వసూళ్లు పుంజుకున్నాయి. కల్యాణ్ రామ్ హీరోగా నటించిన ఈ సినిమాలో  కాథరిన్ థెరిస్సా,సంయుక్తా మీనన్ హీరోయిన్లు గా నటించారు. ఎన్టీఆర్ ఈసినిమాకు స్పెషల్ గా ప్రమోషన్ చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios