మరీ ఇంత రొమాంటిక్ సాంగ్ చేయనని చెప్పేశా : కళ్యాణ్ రామ్

Kalyan Ram about Chiniki Chikniki song
Highlights

మరీ ఇంత రొమాంటిక్ సాంగ్ చేయనని చెప్పేశా : కళ్యాణ్ రామ్

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం నా నువ్వే. మే చివరి వారంలో ఈ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. తాజగా ఈ చిత్ర ఆడియో వేడుక ఘనంగా జరిగింది. 180 చిత్రంతో మంచి గుర్తింపు పొందిన జయేంద్ర ఈ చిత్రానికి దర్శకుడు. కళ్యాణ్ రామ్ సరసన మిల్కి బ్యూటీ తమన్నా తొలి సారి నటించింది. ఈ చిత్ర ఆడియో వేడుకలో తమన్నా, కళ్యాణ్ రామ్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. రొమాంటిక్ లవ్ స్టోరీగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. వరుసగా కమర్షియల్ చిత్రాలు చేస్తున్న కళ్యాణ్ రామ్ ప్రేమ కథలో నటించడం ఇదే తొలిసారి.

ఈ చిత్ర ఫస్ట్ డే షూట్ లోనే తమన్నాతో రొమాంటిక్ సాంగ్ చేయవలసి వచ్చింది. అప్పటివరకు తమన్నాతో కనీసం పరిచయం కూడా లేదు. అలాంటిది అప్పుడే రొమాంటిక్ సాంగ్ ఏంటి.. నేను చేయనని నిర్మాతకు చెప్పా అని కళ్యాణ్ రామ్ అన్నారు. కానీ చేయవలసిందే అని వారు కోరడంతో చినికి చినికి అనే సాంగ్ చేసానని, తమన్నా సపోర్ట్ లేకుండా చేసే వాడిని కాదని కళ్యాణ్ రామ్ అన్నాడు.

చినికి చినికి సాంగ్ లో కళ్యాణ్ రామ్, తమన్నా మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరినట్లు తెలుస్తోంది. ఈ సాంగ్ చేసే సమయంలో తమన్నానే చాలా బాగా సపోర్ట్ చేసిందని కళ్యాణ్ రామ్ అభిప్రాయపడ్డాడు. తమన్నా, కళ్యాణ్ రామ్ మధ్య రొమాన్స్ ఎలా సాగిందో ఈ సాంగ్ ప్రోమో చూస్తే అర్థం అవుతుంది.

loader