నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తోన్న చిత్రం '118'. కెవి గుహన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో నివేదా థామస్, శాలిని పాండే హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ ని విడుదల చేసింది చిత్రబృందం. 

కళ్యాణ్ రామ్, శాలిని ల మధ్య రొమాంటిక్ సాంగ్ తో టీజర్ మొదలైంది. ఏదో ప్రమాదం జరిగినట్లుగా టీజర్ లో చూపించారు. టీజర్ ని బట్టి ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్ నేపధ్యంలో సాగే కథగా అనిపిస్తోంది. శేఖర్ చంద్ర నేపధ్య సంగీతం టీజర్ కి హైలైట్ గా నిలిచింది.

కానీ టీజర్ ని బట్టి సినిమా ఎలా ఉంటుందనే విషయం చెప్పలేని పరిస్థితి. మహేష్ కోనేరు నిర్మిస్తోన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.