బ్రహ్మానందంపై రివెంజా?

kalyan krishna takes revenge on comedian brahmanandam
Highlights

కమెడియన్ ఎన్నో చిత్రాలలో నటించిన బ్రహ్మానందం క్రేజ్ బాగా పడిపోయింది. 

కమెడియన్ ఎన్నో చిత్రాలలో నటించిన బ్రహ్మానందం క్రేజ్ బాగా పడిపోయింది. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమా అంటే అందులో కచ్చితంగా బ్రహ్మానందం ఉండాల్సిందే. వెండితెరపై హీరోల ఎంట్రీకి విజిల్స్ పడవేమో కానీ బ్రహ్మానందం కనిపిస్తే మాత్రం హడావిడి మాములుగా ఉండదు. కానీ ఇప్పుడు పరిస్థితి మొత్తం మారిపోయింది. ఆయనకు అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. సినిమాలు చేస్తున్నా అందులో చెప్పుకునే పాత్ర పడడం లేదు.

ఒక జూనియర్ ఆర్టిస్ట్ కు ఇచ్చే స్క్రీన్ స్పేస్ కూడా బ్రహ్మానందంకు ఇవ్వడం లేదు. రీసెంట్ గా విడుదలైన 'నేల టికెట్టు' సినిమాలో బ్రాహ్మీ క్యారెక్టర్ మరి ఘోరంగా ఉందనే  చెప్పాలి. రెండు, మూడు సీన్లలో మాత్రమే కనిపించాడు. ఇక డైలాగ్స్ అయితే చెప్పినట్లు కూడా గుర్తులేదు. దీని వెనుక ఓ రివెంజ్ డ్రామా నడిచిందని టాక్. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కావాలనే బ్రాహ్మీ రోల్ ఇలా చేశాడని అంటున్నారు.

కళ్యాణ్ డైరెక్ట్ చేసిన మొదటి సినిమా 'సోగ్గాడే చిన్ని నాయనా'లో బ్రహ్మానందంకు ఫుల్ లెంగ్త్ రోల్ దక్కింది. అప్పటికి కళ్యాణ్ డెబ్యూ డైరెక్టర్ కావడంతో షూటింగ్ సమయంలో బ్రాహ్మీ బాగా డామినేట్ చేశారట. చెప్పిన సమయానికి షూటింగ్ కి రాకపోవడం, ఇచ్చిన డైలాగ్స్ తనకు నచ్చినట్లుగా చెప్పడం వంటివి చేశాడట. సీనియారిటీ కారణంగా కళ్యాణ్ ఎదురునిలిచి  మాట్లాడలేరు.

దీంతో అతడిపై రివెంజ్ తీర్చుకోవడానికే 'నేల టికెట్టు' సినిమాలో అటువంటి దారుణమైన పాత్ర ఇచ్చారని అంటున్నారు. బ్రహ్మీపై  చిత్రీకరించిన సీన్స్ ను కూడా ఎడిటింగ్ లో కట్ చేశారట. ఎన్ని కోపాలు ఉంటే ఏం లాభం చివరికి ఆ ఎఫెక్ట్ సినిమా మీదే పడుతుంది. నేల టికెట్టు సినిమా డిజాస్టర్ గా నిలిచింది. 

loader