చిరంజీవి చిన్నల్లుడుపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్ట్ లు పెట్టడంతో అతడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. వివరాల్లోకి వెళితే.. కొందరు ఆకతాయిలు ఇన్స్టాగ్రామ్ లో కళ్యాణ్ దేవ్ పై అసభ్యకర కామెంట్స్ చేస్తున్నారు.

దీంతో ఆయన సైబర్ క్రైమ్ పోలీసులకు దీనిపై ఫిర్యాదు చేశారు. పది మంది పోకిరీలు ఇన్స్టాగ్రామ్ లో వేధిస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. తన కుటుంబంపై కూడా అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపణలు చేశారు.

దీనిపై స్పందించిన అదనపు డీసీపీ రఘువీర్.. హీరోని వేధిస్తున్న పది మందిని గుర్తించినట్లు చెప్పారు. నిందితుల అకౌంట్ల వివరాల కోసం ఇన్స్టాగ్రామ్ కు లేఖ రాసినట్లు చెప్పారు. ఇన్స్టాగ్రామ్ నుండి వివరాలు అందగానే చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

'విజేత' సినిమాతో హీరోగా పరిచయమైన కళ్యాణ్ దేవ్ మొదటి సినిమాతో నటుడిగా ఓకే అనిపించుకున్నాడు. ప్రస్తుతం తన కొత్త సినిమా షూటింగ్ లో బిజీగా గడుపుతున్నాడు.