Asianet News TeluguAsianet News Telugu

Super Machi: డిఫరెంట్ ఎప్రోచ్ తో 'సూపర్ మచ్చి' ట్రైలర్ ,ఇదిగో

 కళ్యాణ్ దేవ్ హీరోగా నటిస్తున్న “సూపర్ మచ్చి” చిత్రం జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో రచతా రామ్, రాజేంద్ర ప్రసాద్, పోసాని కృష్ణ ప్రసాద్, ప్రగతి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.  

Kalyaan Dhev Super Machi Trailer Is Out
Author
Hyderabad, First Published Jan 12, 2022, 11:29 AM IST

చిరంజీవి అల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా 'సూపర్ మచ్చి' సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. రిజ్వాన్ నిర్మించిన ఈ సినిమాకి పులి వాసు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాతో రచిత రామ్ తెలుగు తెరకి హీరోయిన్ గా పరిచయమవుతోంది. ఈ సినిమా విడుదలకి ముస్తాబై కొంతకాలంగా సరైన తేదీ కోసం వెయిట్ చేస్తోంది. అయితే పెద్ద సినిమాలు అన్నీ సీన్ లోంచి తప్పుకోగా ఈ నెల 14వ తేదీన ఈ చిత్రం థియేటర్లకు రానుంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి కొంతసేపటి క్రితం ట్రైలర్ ను వదిలారు. ఈ కథలోని వివిధ కోణాలను ట్రైలర్ ద్వారా ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. ట్రైలర్ బాగుంది… ట్రైలర్ చూస్తుంటే రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా అని తెలుస్తోంది. హీరోను హీరోయిన్ రాముడిగా మార్చేస్తుందా ? లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ ప్రధానంగా చేసుకుని కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఈ కథలో హీరోయిన్ ప్రేమని పొందలేకపోయిన అజయ్ .. విలన్ గా మారతాడని అర్థమవుతోంది.

రాజేంద్రప్రసాద్ .. తనికెళ్ల భరణి .. పోసాని .. ప్రగతి వంటి సీనియర్ ఆర్టిస్టులు ఈ సినిమాకి ప్లస్ గా ఉన్నారు. "వాడిని పెళ్లి చేసుకుంటే నువ్వు సీతవు అవుతావో లేదో నాకు తెలియదు గానీ, వాడు మాత్రం రాముడు అవుతాడమ్మా" అనే రాజేంద్రప్రసాద్ డైలాగ్ బాగా పేలింది. ఈ సినిమా కల్యాణ్ దేవ్ కెరియర్ కి ఎంతవరకూ హెల్ప్ అవుతుందో చూడాలి.
 

Follow Us:
Download App:
  • android
  • ios