సీనియర్ హీరో రాజశేఖర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'కల్కి'. ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

''ఆకాశవాణి.. కొల్లాపూర్‌ ఎమ్మెల్యే నర్సప్ప తమ్ముడు శేఖర్‌బాబు దారుణ హత్య తర్వాత నర్సప్ప పెరుమాండ్ల వర్గీయుల మధ్య పరస్పర దాడులతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి'' అంటూరేడియోలో వచ్చే వాయిస్ తో ట్రైలర్ మొదలైంది.

నటుడు రాహుల్ రామకృష్ణ.. 'శేఖర్ బాబుని ఎవరు చంపారు..?' అంటూ కనిపించిన ప్రతీఒక్కరినీ అడుగుతూ ఆరాతీస్తుంటాడు. శేఖర్ బాబుని ఎవరు చంపారో తనకు తెలుసునని రాహుల్ రామకృష్ణ చెప్పడంతో.. ఎంక్వైరీ మొదలుపెడదాం అంటూ రాజశేఖర్ చెప్పడంతో ఇదొక హత్య నేపధ్యంలో సాగే సినిమాగా తెలుస్తోంది.

ట్రైలర్ లోనే పవర్ ఫుల్ డైలాగులు పలికించారు. డైరెక్టర్ చాలా ఇంటరెస్టింగ్ గా ట్రైలర్ ని కట్ చేశారు. కథ, నేపధ్యం, డైలాగ్స్ మొత్తం చూస్తుంటే ఈసారి కూడా రాజశేఖర్ హిట్ కొట్టేలానే కనిపిస్తున్నాడు. ఈ శుక్రవారం నాడు సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.