బాలీవుడ్ ఇప్పుడు బాహుబలిని టార్గెట్ గా పెట్టుకున్నట్లు ఉంది. భారీతనంతో పెయింటింగ్ లాంటి విజువల్స్ తో మరో చిత్రాన్ని దింపుతోంది. బ్రిటీష్ కాలం నాటి లవ్ స్టోరీ తో మన ముందుకు వస్తున్న చిత్రం ‘కళంక్‌’. ఈ చిత్రంపై సినిమా ప్రారంభం రోజు నుంచి అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్లే సంజయ్ లీలా భన్సాలీ మేకింగ్ ని గుర్తు చేస్తూ ఈ చిత్రం తెరకెక్కింది. ఆ సినిమాకు సంభందించిన టీజర్ రిలీజ్ చేసారు. టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆ టీజర్ ని మీరు ఇక్కడ చూడవచ్చు. 

మాధురీ దీక్షిత్‌, సంజయ్‌ దత్‌, ఆలియా భట్‌, వరుణ్‌ ధావన్‌, సోనాక్షి సిన్హా‌, ఆదిత్య రాయ్‌ కపూర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కళంక్‌’. అభిషేక్‌ వర్మన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కాగా.. ‘కళంక్‌’ టీజర్‌ను చిత్ర యూనిట్ మంగళవారం విడుదల చేసింది. 

1945లో, భారతదేశానికి స్వాతంత్రం రాకముందు ఓ యువరాణికి, ఓ సాధారణ వ్యక్తికి మధ్య పుట్టిన ప్రేమకథ నేపథ్యంలో సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో రూప్‌ అనే యువరాణి ఆలియా పాత్రలో నటించారు. టీజర్‌లోని ప్రతి సీన్ చాలా థ్రిల్లింగ్ గా, సినిమాపై ఎక్సపెక్టేషన్స్  పెంచే విధంగా ఉంది.

‘ఒకరిని నాశనం చేస్తేనే అది మన విజయం అవుతుందంటే.. ఈ ప్రపంచంలో మనకంటే ఓటమిపాలైనవారు మరొకరుండరు’ అంటూ టీజర్‌ చివర్లో వచ్చిన డైలాగ్‌ హైలైట్‌గా నిలిచింది. ఏప్రిల్‌లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.