`ఆ నలుగురు` చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించిన విశ్వ కార్తికేయ ఇప్పుడు హీరోగా మారాడు. అంతేకాదు కళా పోషకుడిగా తన కళలు చూపించబోతున్నాడు. తాను హీరోగా, దీప ఉమావతి హీరోయిన్‌గా నటిస్తున్న `కళాపోషకులు` చిత్రానికి చలపతి పువ్వల దర్శకత్వం వహిస్తున్నారు. 

త్వరలో రిలీజ్‌ కాబోతున్న ఈ సినిమా గురించి  దర్శకుడు చలపతి పువ్వల మాట్లాడుతూ, `నిర్మాత రాజీలేకుండా నిర్మించడం, హీరో విశ్వకార్తికేయ మంచి నటన ప్రదర్శించడం, దీప ఉమావతి గ్లామర్‌తో ఆకట్టుకోవడంతో సినిమా బాగా వచ్చింది. టెక్నీకల్‌ అంశాలు దీనికి అదనపు ఆకర్షణగా నిలుస్తాయని, టైటిల్‌ తగ్గట్టు హీరోహీరోయిన్లు మామూలు కళాపోషకులు కాదని చెప్పారు.

`మహావీర్‌ సంగీతం సినిమా అస్సెట్‌ కానుంది. లవ్‌ స్టోరీతోపాటు ఫ్యామిలీ అంశాలు ఇందులో ఉండబోతున్నాయి. విశ్వకార్తికేయ ఈ చిత్రంతో హీరోగా పరిచయం కావడం ఆనందంగా ఉంది. కోవిడ్ 19 లాక్ డౌన్ తరవాత ప్రభుత్వ సూచనలు, చిత్రసీమ పెద్దల సలహాలు పాటిస్తూ చిత్రీకరణ  మొదలు పెట్టీ ఎటువంటి ఇబ్బందులు, లేకుండా దిగ్విజయంగా సెరవేగంగా షూటింగ్ జరుపుకున్న కళ పోషకులు సినిమాకి పనిచేసిన ప్రతీ ఒక్కరికీ నిర్మాత ఎమ్‌.సుధాకర్‌రెడ్డి చెప్పారు.