టాలీవుడ్ చందమామ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న కాజల్ అగర్వాల్ ఇటీవల ఆడియెన్స్ తో ముచ్చటించింది. ట్విట్టర్ లో మూడు మిలియన్ల ఫాలోవర్స్ ని సొంతం చేసుకున్న అమ్మడు నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు ఓపికతో సమాధానం చెప్పింది. ఓ వ్యక్తి పెళ్లి పై వేసిన ప్రశ్నకు కాజల్ ఊహించని విధంగా ఆన్సర్ ఇచ్చింది. 

నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా.. మీ రిప్లై కోసం ఎదురుచూస్తూ ఉంటానని అతను అడగ్గా.. వెంటనే కాజల్ ఈ విధంగా స్పందించింది. ఇంకా చాలా ప్రయత్నించాలి.. అది అంత సులభంగా జరిగే విషయం. ఇంకాస్త ప్రయత్నించండి అంటూ సరదాగా కాజల్ ఇచ్చిన రీ ట్వీట్ కి అతను తెగ సంబరపడిపోతున్నాడు. 

కాజల్ రిప్లై కోసం చాలా మంది నెటిజన్స్ కొంటెగా ప్రశ్నలు వదలగా అదే స్టైల్ లో కాజల్ కూడా ఆన్సర్ ఇచ్చింది. ఒక వ్యక్తి అయితే రిప్లై ఇవ్వకుంటే ఎకౌంట్ డిలీట్ చేస్తానని స్వీట్ గా బెదిరించడంతో అంత పని చేయవద్దని చందమామ స్వీట్ ఆన్సర్ ఇచ్చింది. మొత్తానికి చాలా ఫ్రెండ్లిగా ముచ్చటించిన కాజల్ ప్రస్తుతం భారతీయుడు 2 సినిమాతో పాటు బాలీవుడ్ లో ముంబై సాగా అనే సినిమా చేస్తోంది.