హీరోయిన్ కాజల్, గౌతమ్ కిచ్లు తమ కుమారుడికి పేరుని కూడా నిర్ణయించారు. కుమారుడు ఎంత క్యూట్‌గా ఉన్నాడో, పేరు కూడా అంతే సింపుల్‌గా, క్యూట్‌గా ఉండటం విశేషం.
స్టార్ హీరోయిన్ కాజల్(Kajal) మంగళవారం ఉదయం(7గంటలు) పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. కాజల్, గౌతమ్ కిచ్లు(Gautam Kitchlu) పెళ్లై ఏడాదిన్నర తర్వాత వీరు తమ బిడ్డకి జన్మనిచ్చారు. దీంతో వీరిద్దరి లైఫ్‌లోకి మరో వ్యక్తి వచ్చి చేశారు. కాజల్, గౌతమ్ పేరెంట్స్ హోదా పొందటంతో ఆనందంలో మునిగితేలుతున్నారు. అంతేకాదు బుధవారం తన ముద్దుల కొడుకు ఫోటోని షేర్ చేసింది కాజల్. నుదుటిపై ముద్దు పెడుతున్న పిక్ ని షేర్ చేసుకుంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.
తాజాగా తన కుమారుడికి పేరుని కూడా నిర్ణయించారు. కుమారుడు ఎంత క్యూట్‌గా ఉన్నాడో, పేరు కూడా అంతే సింపుల్‌గా, క్యూట్‌గా ఉండటం విశేషం. కాజల్ భర్త గౌతమ్ కిచ్లు తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కొడుకు పేరుని అనౌన్స్ చేశారు. `నీల్ కిచ్లు`(Neil Kitchlu)గా చిన్నారి పేరుని నిర్ణయించినట్టు వెల్లడించారు. తన కొడుకుని ఈ ప్రపంచంలోకి ఆహ్వానిస్తూ ఆయన ఓ ఫోటోని పంచుకున్నారు. తమహృదయాలు ఆనందంతో నిండిపోయాయని, బ్లెస్సింగ్స్ అందించిన ప్రతి ఒక్కరికి ధన్వవాదాలు అని తెలిపారు గౌతమ్ కిచ్లు.
స్టార్ హీరోయిన్‌గా రాణిస్తున్న కాజల్.. 2020 అక్టోబర్‌లో గౌతమ్ కిచ్లుని మ్యారేజ్ చేసుకోబోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అక్టోబర్ 6న ప్రకటించి, అక్టోబర్ 30న అతికొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో కాజల్, గౌతమ్ కిచ్లు ఒక్కటయ్యారు. గౌతమ్ కిచ్లు ముంబయికి చెందిన వ్యాపారవేత్త. ఇంటీరియర్ డిజైనింగ్ సంస్థని నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత కాజల్, గౌతమ్ కలిసి కొత్తగా దిండ్ల వ్యాపారాన్ని స్టార్ట్ చేశారు. మ్యారేజ్ తర్వాత కూడా ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేసింది కాజల్. కానీ గర్భవతి అయ్యాక మాత్రం పూర్తి కాని వాటి నుంచి తప్పుకుంది. కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ, ఈ ఏడాది తమ జీవితంలోకి కొత్త వ్యక్తి రాబోతున్నారని, తామకి ఈ ఇయర్ చాలా స్పెషల్ అని పేర్కొన్నారు గౌతమ్ కిచ్లు.
