టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఇన్నేళ్లకు ఒక డిఫరెంట్ రోల్ తో దర్శనమిచ్చింది. కమర్షియల్ సినిమాలు చూసి బోర్ కొట్టేసిందేమో అనుకుంటా అందుకే గ్లామర్ తో పాటు ఈ సారి పొగరు కూడా గట్టిగా యాడ్ చేసి సీత సినిమాతో రెడీ అయ్యింది. 

పేరు సీత అయినా క్యారెక్టర్ మాత్రం సూర్పనక అని టీజర్ తో చూపించేసింది,. దర్శకుడు తేజ లవ్ స్టోరీలను పక్కనెట్టి స్టార్ యాక్టర్స్ ని నెగిటివ్ షెడ్ లో చూపిస్తూ కొత్త ప్రయోగాలేదో చేస్తున్నట్లు అర్ధమవుతోంది. ఇక బెల్లంకొండ శ్రీనివాస్ కూడా యాక్షన్ ఎపిసోడ్స్ ను ఈ సారి తగ్గించేసి తేజ స్టైల్ లోకి మారిపోతున్నాడు. ఇక సినిమా ఏప్రిల్ లో విడుదల కానుంది.