తాను ఐదేళ్ల వయసులో అనారోగ్య సమస్యతో బాదపడినట్టు వెల్లడించింది షాక్‌ ఇచ్చింది కాజల్‌. ఐదేళ్లున్నప్పుడు బ్రాంకియల్‌ అస్తమాతో బాధపడినట్టు కాజల్‌ వెల్లడించింది. ఈ మేరకు కాజల్‌ ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టింది. `సే ఎస్‌ టు ఇన్‌హెలర్స్` అంటూ నినాదానికి తెరలేపింది. ఈ సందర్భంగా కాజల్‌ చెబుతూ, `చిన్నప్పుడు నాకు అస్తమా అని తెలిసింది. ఆ వయసులో ఆహారం విషయంలో ఆంక్షలు విధించడం తనకింకా గర్తుంది.  పాలు, చాక్లెట్ల నుంచి దూరం కావాల్సిన చిన్నారి పరిస్ఙితి ఎలా ఉంటుందో ఓసారి ఊహించుకోండి` అని చెప్పింది. 

ఇంకా చెబుతూ, ప్రతి శీతాకాలంలోనూ, దుమ్ము ధూళిలోకి వెళ్లిన ప్రతిసారీ బ్రాంకియల్‌ అస్తమా లక్షణాలు మరింతగా పెరిగేవి. ఆ పరిస్థితుల నుంచి బయటపడటానికి ఇన్‌ హెలర్స్ ఉపయోగించడం ప్రారంభించా. వెంటనే నాలో మార్పు కనిపించేది. దీంతో ఎల్లప్పుడు నా వెంట ఓ ఇన్‌ హెలర్‌ తప్పకుండా ఉండేలా చూసుకుంటా. మన దేశంలో చాలా మందికి ఇన్‌హెలర్స్ అవసరం. అయితే దాన్ని క్యారీ చేయడం ఓ సామాజిక కళంకంగా చూస్తున్నారు. అందుకే చాలా మంది దాన్ని వెంట ఉంచుకునేందుకు ఇబ్బంది పడుతుంటారు. 

ప్రైవేట్‌గా అయినా, పబ్లిక్‌గా అయినా ఇన్‌ హెలర్స్ ఉపయోగించడంలో సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఈ విషయం అందరికి అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిద్దాం. సే ఎస్‌ టూ ఇన్‌హెలర్స్` అని కొత్త నినాదానికి తెరలేపింది కాజల్‌. ఉబ్బసానికి ఇన్‌హెలర్స్ వాడటంపై అవగాహన కల్పించే విషయంలో మాకు మద్దతుగా నిలవాలని కోరుకుంటున్నా` అని తెలిపింది కాజల్‌. ఆమె గౌతమ్‌ కిచ్లుని మ్యారేజ్‌ చేసుకున్న తర్వాత తన పేరుని మార్చుకున్న విషయం తెలిసిందే. కాజల్‌ ఏ కిచ్లుగా పెట్టుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో `ఆచార్య`, `మోసగాళ్లు`, తమిళంలో `ఇండియన్‌ 2`, `హే సినామికా` చిత్రాల్లో నటిస్తుంది.