టాలీవుడ్ లో చాలా ఏళ్లుగా ఒకే సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటిస్తూ వస్తున్నారు. ఈ విషయంలో చాలా మంది హీరోయిన్ల మధ్య సఖ్యత ఉన్నప్పటికీ కొందరి మధ్య మాత్రం కోల్డ్ వార్ లు నడుస్తుంటాయి. సినిమాలో ఒక హీరోయిన్ కి ఎక్కువ ప్రాధాన్యతనివ్వడం, మరో హీరోయిన్ ని తక్కువగా చూడడం వంటి కారణాలతో హీరోయిన్ల మధ్య కూడా డిఫరెన్సెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తోన్న 'కవచం' సినిమాలో కాజల్ తో పాటు మరో హీరోయిన్ మెహ్రీన్ కూడా కనిపించనుంది. మరో మూడు రోజుల్లో ఈ సినిమా విడుదల కానుండడంతో ప్రమోషన్స్ ముమ్మరం చేశారు. అయితే మెహ్రీన్ గనుక సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటే తాను రానని కాజల్ మేకర్స్ కి చెప్పేసిందట. టీజర్ రిలీజ్ ఫంక్షన్ కి అందరూ కలిసి వచ్చినప్పటికీ ఇకపై మాత్రం మెహ్రీన్ తో కలిసి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనని చెప్పేసిందట.

దీంతో రీసెంట్ గా జరిగిన ఆడియో లాంచ్ ఈవెంట్ లో మెహ్రీన్ కనిపించలేదు. పోనీ మెహ్రీన్ వేరే సినిమాల్లో బిజీగా ఉందా అనుకుంటే ఆమె చేతుల్లో పెద్దగా సినిమాలు కూడా లేవు. రీసెంట్ గా 'కవచం' చిత్రబృందం పాటల చిత్రీకరణ కోసం దుబాయ్ వెళ్లారట.షూటింగ్ లో మెహ్రీన్ పార్ట్ పూర్తయ్యే వరకు కూడా కాజల్ దుబాయ్ షెడ్యూల్ లో పాల్గొనలేదని తెలుస్తోంది.

మెహ్రీన్ ఎప్పుడైతే దుబాయ్ నుండి వెళ్ళిపోయిందో అప్పుడు కాజల్ సెట్స్ లో జాయిన్ అయినట్లు సమాచారం. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఫేస్ బుక్ లైవ్ ప్లాన్ చేశారు. ఇందులో కూడా కాజల్, బెల్లంకొండ శ్రీనివాస్ మాత్రమే కనిపించనున్నారు. మెహ్రీన్ విషయంలో కాజల్ కొంత ఈగో చూపిస్తుందని తన రేంజ్ హీరోయిన్ కాకపోవడంతో ఇలా ప్రవర్తిస్తుందని అంటున్నారు.