బాలీవుడ్ లో హిట్ అయిన 'క్వీన్' సినిమాను సౌత్ భాషల్లో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. తమిళ వెర్షన్ 'పారిస్ పారిస్'లో కాజల్ హీరోయిన్ గా నటించింది. అయితే అందులో ఉన్న అడల్ట్ కంటెంట్, బూతు పదాల కారణంగా ఏకంగా 25 కట్స్ సూచించింది తమిళనాడు సెన్సార్ బోర్డ్. దీనిపై కాజల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. 'పారిస్ పారిస్' 
లాంటి సినిమాకి సెన్సార్ సమస్యలు రావడం ఆశ్చర్యంగా ఉందని.. పూర్తిగా తనకు విషయం తెలియదు కానీ చాలా సమస్యలు వచ్చాయని విన్నట్లు చెప్పింది.

హిందీ వెర్షన్ ని ఉన్నది ఉన్నట్లు తమిళంలో తీశామని.. కానీ ఎందుకు సమస్య వచ్చిందో అర్ధం కాలేదని.. బహుశా తమిళ సెన్సార్ బోర్డ్ నిబంధనలు అలా ఉన్నాయేమోనని చెప్పుకొచ్చింది. నాలుగు భాషల్లో సినిమాను రీమేక్ చేస్తే.. మూడు భాషల్లో ఎలాంటి సెన్సార్ కట్స్ లేవని.. కేవలం తమిళ వెర్షన్ కే సెన్సార్ కట్స్ ఇచ్చారని.. ఇలా ఎందుకు జరుగుతుందో అర్ధం కావడం లేదని.. ప్రస్తుతం నిర్మాతలు ఆ పని మీదే ఉన్నట్లు.. రివైజింగ్ కమిటీకి వెళ్తున్నట్లు వెల్లడించింది. 

కాజల్ ఇలా స్పందించినప్పటికీ సినిమాలో అడల్ట్ కంటెంట్ ఉందనే మాట మాత్రం నిజమే.. సినిమా టీజర్ తోనే షాక్ ఇచ్చింది చిత్రబృందం. కాజల్ వక్షభాగాన్ని మరోనటి పట్టుకోవడం వంటి అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయి. అలానే సినిమాలో ఆమె బాత్ రూమ్ లో బట్టలు మార్చుకునే సీన్ కూడా ఉంది. ఇలాంటి సీన్లు మిగతా వెర్షన్స్ లో లేవు. కాబట్టి ఆ సినిమాలకు సెన్సార్ సమస్యలు లేవు. కాజల్ సినిమాకి మాత్రం ఈ  తిప్పలు తప్పేలా లేవు!