స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌ మ్యారేజ్‌ కాసేపట్లో జరగబోతుంది. దీంతో తన బ్యాచ్‌లర్‌ లైఫ్‌కి ఫుల్‌స్టాప్‌ పెట్టబోతుంది. తన ప్రియుడు గౌతమ్‌ కిచ్లుని వివాహం చేసుకోబోతుంది. ముంబయిలో ఓ ప్రైవేట్‌ ఈవెంట్‌గా వీరి వివాహం జరుగుతుంది. దీంతో రెండు రోజుల క్రితమే కాజల్‌-గౌతమ్‌ కిచ్లుల మ్యారేజ్‌కి సంబంధించిన సందడి ప్రారంభమైంది. 

ప్రీ వెడ్డింగ్‌ ఫోటోలను సోషల్‌ మీడియాలో పంచుకోగా, అవి ఇప్పటికే వైరల్‌ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరో ఫోటోని పంచుకుంది కాజల్‌. అయితే ఈ సారి బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫోటోని షేర్‌ చేసింది. పెళ్ళికి రెడీ అవుతున్నట్టుగా ఆమె ఫోటో ఉంది. 

అయితే ఇంత వరకు బాగానే ఉంది కానీ, కాజల్‌ పెట్టిన పోస్టే ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తుంది. మ్యారేజ్‌ని తుఫాన్‌తో పోల్చింది. `తుఫాన్‌కి ముందు ప్రశాంతత` అని పేర్కొంది. దీంతో ఇది అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అయినప్పటికీ ఆమె అభిమానులు, సినీ సెలబ్రిటీలు శుభాకాంక్షలు చెబుతున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా స్పందిస్తూ, గాడ్‌ బ్లెస్‌ అని చెప్పగా, మీ ఇద్దరికి లాట్స్ ఆఫ్‌ లవ్‌ అని రకుల్‌, `సో ప్రెట్టీ బ్యూటీఫుల్‌ గా ఉన్నవాని మంచు లక్ష్మీ అభినందనలు తెలిపారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Calm before the storm 🤍#kajgautkitched

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on Oct 30, 2020 at 2:59am PDT

ఇదిలా ఉంటే కాజల్‌ మెహందీ హల్దీ వేడుకల్లో ఆమె సోదరి నిషా అగర్వాల్ భావోద్వేగానికి గురయ్యింది. కన్నీళ్ళు పెట్టుకుంది. నిషా ఎమోషనల్ అవుతున్న క్షణానికి సంబంధించిన అరుదైన ఫోటోను కాజల్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఇది ఆకట్టుకుంటుంది.