కాజల్‌ ఇప్పుడు ప్రియుడి ప్రేమలో మునిగి తేలుతుంది. పెళ్ళికి ముందు ఆయన ప్రతి మూవ్‌మెంట్‌ని ఎంజాయ్‌ చేస్తుంది. ముంబయికి చెందిన ఇంటీరియర్‌ డిజైన్‌కి చెందిన కంపెనీ అధినేత గౌతమ్‌ కిచ్లుని కాజల్‌ పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. 

ఇటీవల ఈ విషయాన్ని కాజల్‌ ప్రకటించింది. ఈ నెల 30న ముంబయిలోని ఓ ప్రైవేట్‌ ఈవెంట్‌గా ఈ మ్యారేజ్‌ జరగబోతుందని తెలిపింది. అయితే తాజాగా గౌతమ్‌.. కాజల్‌తో ఎంగేజ్‌మెంట్‌ పిక్‌ని పంచుకున్నారు. ఇందులో బ్లాక్‌ అండ్‌వైట్‌లో ఉన్న ఫోటోని ఎంగేజ్‌మెంట్‌ డెకరేషన్‌లో వేలాడదీశారు. దాని వెనకాల బెలూన్స్ ఉన్నాయి. 

అయితే ఈ ఫోటోలో గౌతమ్‌ కిచ్లుతో కంటే దాని వెనకాల ఉన్న డిజైన్‌ కాజల్‌కి బాగా నచ్చిందట. డిజైన్‌పై కాజల్‌ ప్రశంసలు కురిపించింది. `ఇది కూడా డిజైన్‌ అంశాన్ని ప్రతిబింబిస్తోందని, కళాత్మక హృదయం కలిగిన నా ఫియాన్సీ` అని కామెంట్‌ చేసింది. ఇది విశేషంగా ఆకట్టుకుంటుంది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

♾🎈

A post shared by Gautam Kitchlu (@kitchlug) on Oct 12, 2020 at 8:52am PDT