అందంతో, అభినయంతో తనకంటూ టాలీవుడ్ ఇండస్ట్పీలో సుస్థిర స్థానం సంపాదించుకుంది కాజల్ అగర్వాల్. లక్ష్మీ కళ్యాణం సినిమాతో ఎంట్రీ ఇచ్చి అనతి కాలంలోనే అగ్హర నటీమణిగా ఎదిగి మెగాస్టార్ సరసన కూడా ఛాన్స్ కొట్టేసి తనకు సాటిలేదని నిరూపించింది కాజల్. మెగాస్టార్ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కాజల్ ఖైదీకి ఎసెట్ అయిందనే ప్రశంసలు పొందింది. ఖైదీ నెంబర్ 150 మెగా కలెక్షన్స్ సాధిస్తున్న నేపథ్యంలో కాజల్ తో చిట్ చాట్..
చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నెం 150లో నటించటంపై ఫీలింగ్?
లెజెండ్ చిరంజీవి గారితో పనిచేయడం ఎప్పటికీ మరచిపోలేని అనుభూతి. వెరీ నైస్ పర్సన్...చిరంజీవి గారితో నటించడం అనేది మాటల్లో చెప్పలేను. అద్భుతమైన ఫీలింగ్.
మెగా హీరోలు చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్...లతో నటించారు కదా..! ఈ మెగా హీరోల్లో ఎవరు బెస్ట్ అనిపించారు..? ఎవరితో నటించడం కష్టం అనిపించింది..?
ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కాస్త కష్టమే. ఒకటి మాత్రం చెప్పగలను నా ఫేవరేట్ హీరో చిరంజీవి గారే బెస్ట్.
ఈ సినిమాలో మీ క్యారెక్టర్ చాలా చిన్నదైనా చేయడానికి కారణం..?
ఓరిజినల్ మూవీ కత్తి చూసాను. ఇందులో నా క్యారెక్టర్ చిన్న క్యారెక్టరే. అయితే...కొన్ని సినిమాలు మన కోసం చేయాలి. కొన్ని సినిమాలు ప్రేక్షకుల కోసం చేయాలి. అలా...ఈ సినిమాని ప్రేక్షకుల కోసం చేసా.
ఈ సినిమాలో హీరోయిన్ గా మిమ్మల్నే ఎంచుకోవడానికి కారణం ఏమిటి అనుకుంటున్నారు..?
ఈ ప్రశ్న వినాయక్ గార్ని అడగాలి (నవ్వుతూ..) కారణం ఏదైనా సరే నన్ను సెలెక్ట్ చేసినందుకు వెరీ హ్యాపీ.
చిరంజీవితో డ్యాన్స్ చేయడం ఎలా అనిపించింది..?
చిరంజీవి గారు అమేజింగ్ డ్యాన్సర్. ఆయనతో డ్యాన్స్ చేయడం కోసం హార్డ్ వర్క్ చేసాను. ఆయన నాకు డ్యాన్స్ విషయంలో కొన్ని టిప్స్ ఇచ్చారు. చిరంజీవి గారితో వర్క్ చేస్తూ చాలా నేర్చుకున్నాను.
చరణ్ ని ఇప్పటి వరకు హీరోగా చూసారు ఇప్పుడు ప్రొడ్యూసర్ కదా..! నిర్మాత చరణ్ గురించి..?
చరణ్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఫస్ట్ వెంచర్ ఈ భారీ ప్రాజెక్ట్ చేయడం హ్యపీ. చాలా ఫ్రొఫిషినల్ గా ఈ మూవీని ప్రొడ్యూస్ చేసారు ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు.
చిరంజీవితో సెట్స్ లో ఉన్నప్పుడు ఎక్కువగా ఏ విషయాల గురించి డిష్కస్ చేసేవారు...?
చిరంజీవి గారితో వండర్ ఫుల్ ఎక్స్ పీరియన్స్..ఎక్కువుగా ప్రొఫెషన్ గురించే మాట్లాడుకునేవాళ్లం. ఫుడ్, ట్రావెలింగ్ గురించి మాట్లాడేదాన్ని.
లాస్ట్ ఇయర్ మీరు నటించిన జనతా గ్యారేజ్, ఇప్పుడు ఖైదీ నెం 150 100 కోట్లకు పైగా వసూలు చేయడం ఎలా ఫీలవుతున్నారు..?
జనతా గ్యారేజ్ లో నేను స్పెషల్ సాంగే చేసాను. అయినా జనతా గ్యారేజ్ అంత కలెక్ట్ చేసినందుకు నాకు క్రెడిట్ ఇస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది.
ఐటం సాంగ్స్ చేయడానికి రెడీనా..?
ఐటం సాంగ్స్ కోసం ప్రత్యేకించి ప్లాన్స్ ఏమీ లేవు. గ్రేట్ ఆఫర్ వస్తే ఆలోచిస్తాను.
లక్ష్మీ కళ్యాణంతో కెరీర్ ప్రారంభించారు...ఇంతకీ మీ కళ్యాణం ఎప్పుడు..?
నా వయసు 30 ఏళ్లే. త్వరలో చేసుకుంటాను అయితే ప్రస్తుతం ఆ ఆలోచన లేదు.
నెక్ట్స్ ప్రాజెక్ట్స్ గురించి..?
రానా హీరోగా తేజ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా చేస్తున్నాను. ఆతర్వాత అజిత్ తో ఓ మూవీ, విజయ్ తో ఓ మూవీ చేస్తున్నాను.
