టాలీవుడ్ చందమామ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ కాజల్ అగర్వాల్. కాలం ఎంత మారుతున్నా కుర్ర హీరోయిన్స్ ఎంత మంది  పోటీగా వచ్చినా కూడా ఈ బ్యూటీ తన క్రేజ్ ని ఏ మాత్రం తగ్గించుకోవడం లేదు. చిన్నా పెద్దా తేడా లేకుండా అన్ని వర్గాల హీరోలతో వర్క్ చేస్తోంది. 

వరుసగా అవకాశాలను అందుకుంటూ సౌత్ లో మహారాణిలా కొనసాగుతోంది. ఇక చాలా కాలం తరువాత ఈ చందమామ సూర్యతో నటించడానికి రెడీ అయ్యింది. ఏడేళ్ల క్రితం కాజల్ సూర్యతో బ్రదర్స్ (2012) అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. అయితే మళ్ళీ వీరిద్దరి కలయికలో సినిమా రాలేదు. ఇక ఇన్నేళ్లకు శివ దర్శకత్వంలో సూర్య చేయనున్న బిగ్ ప్రాజెక్ట్ లో కాజల్ నటించడానికి ఒప్పుకుంది. 

ప్రస్తుతం ఆ సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఎండింగ్ కి వచ్చాయి. త్వరలో ఈ విషయంపై దర్శకుడు అఫీషియల్ ఎనౌన్సమెంట్ ఇవ్వనున్నాడు. ఇక ప్రస్తుతం కాజల్ ఇండియన్ 2 సినిమాతో పాటు మరో రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఇక రీసెంట్ గా కోలీవుడ్ లో కోమలి సినిమాతో కాజల్ బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే.