టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌ త్వరలో పెళ్ళి చేసుకోబోతుంది. ముంబయికి చెందిన బిజినెస్‌మేన్‌ గౌతమ్‌ కిచ్లుని ఈ నెల 30న ముంబయిలో ప్రైవేట్‌ ఈవెంట్‌గా మ్యారేజ్‌ చేసుకునేందుకు రెడీ అవుతుంది. ఓ వైపు పెళ్ళి పనుల్లో బిజీగా ఉన్న కాజల్‌.. ఉన్నట్టుండి కొత్త లుక్‌లోకి మారిపోయింది. దెయ్యంగా దర్శనమిచ్చింది. 

కాజల్‌ తాజాగా వెబ్‌ సిరీస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అంతేకాదు తాను కూడా ప్రజెంటర్‌గా వ్యవహరిస్తుంది. `లైవ్‌ టెలీకాస్ట్` పేరుతో రూపొందే వెబ్‌ సిరీస్‌లో నటిస్తుంది. హర్రర్‌ ప్రధానంగా సాగే ఈ సిరీస్‌ పోస్టర్‌ని కాజల్‌ తన ఇన్ స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది. ఈ పోస్టర్‌తో షాక్‌ ఇచ్చిందీ చందమామ. పోస్టర్‌లో దెయ్యంగా కనిపించి భయానికి గురి చేసింది. ఇప్పటి వరకు గ్లామర్‌ పాత్రలతో, అందాల ఆరబోతకే ప్రయారిటీ ఇచ్చిన కాజల్‌లోని ఈ యాంగిల్‌ని చూసి అభిమానులు, నెటిజన్లు షాక్‌కి గురవుతున్నారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Presenting my debut on @disneyplushotstarvip coming soon - LIVE TELECAST @venkat_prabhu

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on Oct 23, 2020 at 3:56am PDT

దీనికి వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహిస్తుండగా, త్వరలోనే ఇది డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌లో ప్రసారం కానుంది. ఇది తమిళ వెబ్‌ సిరీస్‌ కావడం గమనార్హం. ఇక ఈ మిత్రవింద తెలుగులో `ఆచార్య`, తమిళంలో `ఇండియన్‌ 2` చిత్రాల్లో నటిస్తుంది.