తెలుగు తెర అందాల చందమామ కాజల్ సెకండ్ ఇన్నింగ్స్ గ్రాండ్‌గా స్టార్ట్ చేయబోతుంది. ఇప్పటికే ఓ సీనియర్ స్టార్ హీరోకి ఓకే చెప్పిన ఈ భామ ఇప్పుడు మరో స్టార్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.
కాజల్ అగర్వాల్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తుంది. గతేడాది ప్రారంభంలో సినిమాలకు గ్యాప్ ఇచ్చింది కాజల్. ప్రెగ్నెన్సీ కారణంగా ఆమె సినిమాలకు దూరమైంది. కుమారుడు నీల్ కిచ్లుకి జన్మనిచ్చింది. ఇక ఇన్నాళ్లు మాతృత్వపు మధుర క్షణాలను అనుభవించింది. ఇక మళ్లీ ప్రొషేషనల్‌గా బిజీ అయ్యేందుకు ప్లాన్ చేసుకుంటుంది. సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తుంది. ఇప్పటికే ఆమె గతంలో ఒప్పుకున్న కమిట్‌మెంట్ `ఇండియన్ 2`లో నటించాల్సి ఉంది. ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉంది కాజల్.
ఇప్పుడు కొత్తగా రెండు సినిమాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందట. తెలుగులో ఆమె బాలయ్యతో అనిల్ రావిపూడి చిత్రంలో నటించేందుకు ఒప్పుకుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. దీంతోపాటు తమిళంలో మరో సినిమాకి సైన్ చేసిందని సమాచారం. స్టార్ హీరో అజిత్‌కి జోడీగా నటించేందుకు ఓకే చెప్పిందట. ఇటీవల `తెగింపు`(తునివు) అలరించారు అజిత్. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా పెద్ద హిట్ అయ్యింది. రెండు వందల కోట్లకుపైగా కలెక్షన్లని సాధించింది.
ఆ తర్వాత నిజానికి నయనతార భర్త విఘ్నేష్ శివన్‌తో `ఏకే62` సినిమా చేయాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో విఘ్నేష్‌కి నో చెప్పారు అజిత్. దీంతో ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ స్థానంలో మగిజ్ తిరుమేని దర్శకత్వంలో సినిమా చేసేందుకు ఒప్పుకున్నారు అజిత్. ఈ సినిమాలో హీరోయిన్‌గా కాజల్‌ని అప్రోచ్ అయినట్టు సమాచారం. కాజల్ రోల్ ఫ్లాష్ బ్యాక్‌లో ఉంటుందని సమాచారం. దీంతో ఆమె మెయిన్ హీరోయినా? లేక సెకండ్ హీరోయినా? అనే సందేహాలు కలుగుతున్నాయి. దీనిపై మున్ముందు క్లారిటీ రావాల్సి ఉంది.
మొదట అజిత్ సరసన చాలా మంది కథానాయికలను అనుకున్నారు. కానీ ఇప్పుడు కాజల్ నేమ్ తెరపైకి వచ్చింది. ఆమెని ఆల్మోస్ట్ ఫిక్స్ చేశారట. అజిత్‌తో చేసేందుకు కాజల్ కూడా ఓకే చెప్పిందని టాక్. ఈ సినిమా లైకా ప్రొడక్షన్ నిర్మిస్తుండగా, అనిరుథ్ రవిచందర్ సంగీతం అందించనున్నారు. కాజల్ త్వరలోనే బాలయ్య సినిమా షూటింగ్‌లో పాల్గొనబోతుందని సమాచారం. ఇలా కాజల్ సెకండ్ ఇన్నింగ్స్ లో జోరుపెంచుతుందని చెప్పొచ్చు.
