టాలీవుడ్ చందమామగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న కాజల్ అగర్వాల్ ప్రస్తుతం కోలీవుడ్ పై పట్టు బిగించింది. ఇక్కడ వరుస అపజయాలు బేబీని దెబ్బ కొట్టినా అక్కడ సింగిల్ హిట్ చందమామ క్రేజ్ ని అమాంతంగా పెంచేశాయి. జయంరవితో నటించిన కోమలి సినిమా తమిళ్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది. 

ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమా 30కోట్లకు పైగా లాభాలతో నిర్మాతలను ఆనందంలో నింపింది. ఒక్క చెన్నైలోనే 5కోట్ల షేర్స్ దక్కినట్లు సమాచారం. దీంతో బేబీకి కోలీవుడ్ లో డిమాండ్ పెరిగినట్లు తెలుస్తోంది. వయసు పెరిగిన కాజల్ ఎవరికీ అంతగా నచ్చడం లేదని వస్తోన్న కామెంట్స్ కి అమ్మడు సక్సెస్ తో సమాధానం ఇచ్చింది. 

ఇక రెమ్యునరేషన్ 40% పెంచి కాజల్ ఆఫర్స్ అందుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఇండియన్ 2లో లీడ్ రోల్ లో నటిస్తోంది. అలాగే మరో రెండు తమిళ్ సినిమాలు సెట్స్ పైకి రానున్నాయి. ఇక తెలుగులో మాత్రం గత రెండు సినిమాలతో కాజల్ అపజయాల్ని చూడాల్సివచ్చింది. మరి కోలీవుడ్ లో బేబీ ఇంకెలాంటి ఆఫర్స్ అందుకుంటుందో చూడాలి.