Asianet News TeluguAsianet News Telugu

‘సత్యభామ’ టీజర్.. కాజల్ అగర్వాల్ ను ఇలా చూడటం మొదటిసారే?

కాజల్ అగర్వాల్ లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ ‘సత్యభామ’ చిత్రం నుంచి టీజర్ విడుదలైంది. యాక్షన్ తో స్టార్ హీరోయిన్ అదరగొట్టింది. సినిమాపై ఆసక్తిని పెంచింది.
 

Kajal Aggarwals Satyabhama Teaser Out Now NSK
Author
First Published Nov 10, 2023, 1:26 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal Aggarawal)  లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో అలరిస్తోంది. చివరిగా ‘ఘోస్టీ’, ‘భగవంత్ కేసరి’ చిత్రాలో అలరించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా కాజల్ Satyabhama అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈ మూవీ 60 శాతానికి పైగా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. త్వరలో షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకోకున్నారు. 

కాజల్ నటించిన ఈ లేడీఓరియెంటెడ్ చిత్రంపై అభిమానుల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది. పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తుండటంతో పాటు యాక్షన్ పరంగానూ అదరగొట్టనుంది. ప్రస్తుతం దీపావళి ఫెస్టివల్ ఉండటంతో టీమ్ అదిరిపోయే టీజర్ ను విడుదల చేసింది.  టీజర్ లో కాజల్ చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తోంది. యాక్షన్ పరంగానూ అదరగొట్టింది. చాలారోజులత కాజల్ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ రాబోతుందని టీజర్ ద్వారా అర్థమవుతోంది. 

టీజర్ విషయానికొస్తే.. హత్యకు గురైన ఓ యువతిని రక్షించే క్రమంలో ఆమె ప్రాణాలు కాపాడలేకపోతుంది పోలీస్ ఆఫీసర్ సత్యభామ. అప్పటి నుంచి ఆమె గిల్టీ ఫీలింగ్ తో బాధపడుతుంటుంది. పై అధికారులు సత్య..ఈ కేసు నీ చేతుల్లో లేదు అని చెబితే..కానీ ఆ ప్రాణం నా చేతుల్లోనే పోయింది సార్ అంటుంది సత్య. అమాయకురాలైన యువతిని చంపిన హంతకుల వేట మొదలుపెడుతుంది సత్యభామ. ఈ వేటను మన ఇతిహాసాల్లో నరకాసుర వధ కోసం యుద్ధరంగంలో అడుగుపెట్టిన సత్యభామ సాహసంతో పోల్చుతూ ప్లే అయ్యే బ్యాక్ గ్రౌండ్ సాంగ్ ఆకట్టుకుంది. ఈ కేసును క్లోజ్ చేసేది లేదన్న సత్యభామ...యువతి హత్యకు కారణమైన హంతకులను చట్టం ముందు నిలబెట్టిందా లేదా అనే అంశాలతో టీజర్ ఆసక్తికరంగా ముగిసింది.

ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రంలో కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ లో నటిస్తున్నారు. చిత్రాన్ని అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. ‘మేజర్’ చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్ ప్లే అందించారు. సుమన్ చిక్కాల దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రంలో ప్రకాశ్ రాజ్, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు..

Follow Us:
Download App:
  • android
  • ios