అక్కినేని నాగచైతన్య చివరగా నటించిన మజిలీ చిత్రంతో సూపర్ హిట్ సొంతం చేసుకున్నాడు. మజిలీ చైతూని మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి ఎక్కించింది. ఈ చిత్రంతో చైతు, సమంత తామిద్దరం సూపర్ హిట్ జోడి అని మరోసారి నిరూపించుకున్నారు. నాగ చైతన్య తన నెక్స్ట్ మూవీపై ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. 

కొందరు దర్శకుడు కథలతో వస్తున్నా.. వైవిధ్యం ఉన్న కథలకే చైతు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఓ డెబ్యూ దర్శకుడు చెప్పిన స్టోరీ లైన్ చైతూని ఆకర్షించినట్లు తెలుస్తోంది. దీనితో వెంటనే ఓకె చెప్పేశాడట. ఈ చిత్రంలో నాగ చైతన్యకు జోడిగా అందాల చందమామ కాజల్ అగర్వాల్ పేరుని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. 

కాజల్, చైతు గతంలో దడ చిత్రంలో నటించారు. ఆ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. కాజల్ అగర్వాల్ ఇప్పటికి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతోంది. చైతు తదుపరి చిత్రం రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతుందట. దీనితో కాజల్ అగర్వాల్ అయితే బావుంటుందని దర్శకుడు భావిస్తున్నాడు. మరోవైపు ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి మహాసముద్రం చిత్రంలో చైతు నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. 

(200కోట్ల నుంచి 600కోట్ల) భారీ బడ్జెట్ చిత్రాలతో రెడీ అవుతున్న మన స్టార్స్