Asianet News TeluguAsianet News Telugu

కాజల్ ‘సత్యభామ’ నుంచి కీలక ప్రకటన.. ‘గేమ్ ఆన్’ రిలీజ్ డేట్.. టాలీవుడ్ మూవీ అప్డేట్స్

టాలీవుడ్ లో తెరకెక్కబోతున్న చిత్రాల నుంచి కీలకమైన అప్డేట్స్ అందాయి.. కాజల్ అగర్వాల్ ‘సత్యభామ’ చిత్రంతో పాటు ఆయా సినిమాల నుంచి ఆసక్తికరమైన అప్డేట్స్ వచ్చాయి.  

Kajal Aggarwal Satyabhama and Game on movie Release Date Updates NSK
Author
First Published Jan 4, 2024, 11:15 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal)  లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా ‘సత్యభామ’ (Satyabhama).  కాజల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా అలరించబోతోంది. అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. ‘మేజర్’ చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్ ప్లే అందించారు. సుమన్ చిక్కాల దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా మూవీ గురించి కీలకమైన అప్డేట్ అందించారు యూనిట్. నవంబర్, డిసెంబర్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుందని, తాజాగా 35రోజుల భారీ షెడ్యూల్ ను కంప్లీట్ చేశారన్నారు. దీంతో చిత్రీకరణ  90శాతం పూర్తయ్యిందిని తెలిపారు. లాంగ్ షెడ్యూల్ లో భారీ యాక్షన్ చిత్రాలను షూట్ చేసినట్టు చెప్పారు. బ్యాలెన్స్ షూటింగ్ కంప్లీట్ చేసి త్వరలోనే రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయబోతున్నారు. చిత్రంలో ప్రకాష్ రాజ్, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషించారు. 

Game On మూవీ రిలీజ్ డేట్ 

గీతానంద్, నేహా సోలంకి జంట‌గా న‌టించిన చిత్రం  ‘గేమ్ ఆన్‌’. క‌స్తూరి క్రియేష‌న్స్ అండ్  గోల్డెన్ వింగ్ ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యాన‌ర్స్‌పై ద‌యానంద్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌వి క‌స్తూరి ఈ సినిమాను నిర్మించారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 2న గ్రాండ్ గా విడుద‌ల‌కు సిద్ద‌మ‌వుతోందని ఈరోజు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్మాత ర‌వి క‌స్తూరి  మాట్లాడుతూ...గేమ్ ఆన్ చిత్రం ఇటీవ‌లే సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. మూవీ అప్డేట్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోందన్నారు. రిలీజ్ కు సమయం ఉండటంతో మరిన్ని అప్డేట్స్ వస్తాయన్నారు. అలాగే దర్శకుడు దయానంద్‌ మాట్లాడుతూ  ‘ఈ చిత్రంలో పాత్రలన్నీ గ్రే షేడ్‌లో ఉంటాయి. ప్రతి పాత్రకు ప్రాధాన్యం ఉంటుంది. తన జీవితాన్ని చాలించాలనుకునే ఓ వ్యక్తి  రియల్‌ టైమ్ సైక‌లాజిక‌ల్ గేమ్‌లోకి ఎలా ప్రవేశించాడు? గేమ్‌లోని టాస్క్‌ను ఎలా స్వీకరించాడు? అసలు ఆ గేమ్‌ ఎంచుకోబడడానికి కారణం ఏమిటి? ఈ గేమ్‌ ఎవరు ఆడిస్తున్నారు? అనే అంశాలతో ‘గేమ్ ఆన్’ సినిమా తెరకెక్కింది. యాక్ష‌న్‌, రొమాన్స్,  ఎమోష‌న్స్ ఆక‌ట్టుకుంటాయి.’ అని చెప్పుకొచ్చారు. 

‘ప్రేమకథ’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్... 

కిషోర్ కేఎస్ డి, దియా సితెపల్లి హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ‘ప్రేమకథ’ (Prema Katha). ఈ చిత్రాన్ని టాంగా ప్రొడక్షన్స్ ఎల్ఎల్ పీ, సినీ వ్యాలీ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి. విజయ్ మట్టపల్లి, సుశీల్ వాజపిల్లి, శింగనమల కల్యాణ్ నిర్మాతలు. ఉపేందర్ గౌడ్ ఎర్ర సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శివశక్తి రెడ్ డీ దర్శకత్వం వహించారు. రేపు ఈ సినిమా గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సందర్బంగా ఇవాళ ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వేడుకలో నటుడు రాజ్ తిరందాసు, దర్శకుడు శివశక్తి రెడ్డి, నిర్మాతలు విజయ్, సుశీల్, హీరో కిషోర్ కేఎస్డీ, నటుడు నేత్ర సాధు, హీరోయిన్ దియా సితెపల్లి, బిగ్ బాస్ ఫేం అమర్ దీప్,  బిగ్ బాస్ ఫేం శుభశ్రీ, శోభ శెట్టి సినిమా గురించి మాట్లాడారు.  

 

Follow Us:
Download App:
  • android
  • ios