కాజల్ ప్రేమలో నిర్మాత తనయుడు

Kajal Aggarwal In Star Producer Son's Debut Movie
Highlights

పట్టుపట్టి మరీ కాజల్ ని ఒప్పించాడట..!

సినీ ఇండస్ట్రీలోకి కాజల్ అడుగుపెట్టి పదేళ్లు దాటింది. అయినప్పటికీ.. ఆమె క్రేజ్ ఇంకా తగ్గలేదనే చెప్పాలి. టాలీవుడ్ స్టార్ హీరోలందరితో నటించి మెప్పించిన ఈ భామ కుర్ర హీరోల సరసన కూడా నటించేందుకు సై అంటుంది. ఇక ఇప్పుడు ఓ నిర్మాత కొడుకు డెబ్యూ మూవీలో కూడా కాజల్ హీరోయిన్ గా నటిస్తుందని టాక్.

కాజల్ ఎంపికలో ఆ నిర్మాత కొడుకు ఇంట్రెస్ట్ ఉందట. కాజల్ సినిమాలను చూస్తూ ఆమె మీద ఆ నిర్మాత కొడుకు ప్రేమలో పడ్డాడట. అందుకే నిర్మాత కొడుకు హీరోగా మొదటి సినిమాలోనే కాజల్ తో రొమాన్స్ కు సిద్ధమయ్యాడట. ఇంతకీ కాజల్ తో జోడి కట్టే నిర్మాత కొడుకు ఎవరంటే డివివి దానయ్య తనయుడే అని తెలుస్తుంది.

బడా నిర్మాతగా దానయ్య గురించి అందరికి తెలిసిందే. ఇప్పుడు తండ్రి సపోర్ట్ తో దానయ్య కొడుకు హీరోగా తనని తాను ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు. దర్శకుడు తేజ చెప్పిన కథ నచ్చడంతో దానయ్య తనయుడితో సినిమా ఫిక్స్ చేశాడట. సినిమాలో హీరోయిన్ గా కాజల్ కావాలని హీరో గారి కోరికట. పట్టుబట్టి మరి ఆమెని ఒప్పించారని టాక్. అంతేకాదు యువ హీరో పక్కన కాబట్టి అమ్మడి డిమాండ్ కూడా భారీగానే ఉందని తెలుస్తుంది.

loader