బాహుబలి తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన చిత్రం కావడంతో సాహోపై దేశవ్యాప్తంగా కనీవినీ ఎరుగని అంచనాలు ప్రేక్షకుల్లో ఉండేవి. హిందీలో మాత్రం సాహో చిత్రం విజయం సాధించింది. తెలుగులో బయ్యర్లు నష్టాల బాటలో ఉన్నారు. ఇదిలా ఉండగా ఈ చిత్రం స్పెషల్ సాంగ్ విషయంలో కాజల్ అగర్వాల్ పై రూమర్లు వచ్చిన సంగతి తెలిసిందే. 

బ్యాడ్ బాయ్ అనే స్పెషల్ సాంగ్ లో బాలీవుడ్ ముద్దుగుమ్మ జాక్వలిన్ ఒక రేంజ్ లో అందాలు ఆరబోసింది. మొదట ఈ సాంగ్ కోసం కాజల్ ని అనుకున్నారని.. ఆ తర్వాత జాక్వెలిన్ కి ఫిక్స్ అయ్యారని వార్తలు వచ్చాయి. దీనితో కాజల్ ప్రభాస్ పై అలిగినట్లు కూడా ఊహాగానాలు వినిపించాయి. 

జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని చిత్ర యూనిట్ ఆ తర్వాత క్లారిటీ ఇచ్చింది. ఇదిలా ఉండగా కాజల్ అగర్వాల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 

ప్రభాస్ ని హాలీవుడ్ సూపర్ హీరోలతో పోలుస్తూ ప్రశంసల వర్షం కురిపించింది. ఐరన్ మ్యాన్, హల్క్ ఇద్దరూ కలిస్తే ఎలా ఉంటుందో ప్రభాస్ అలా ఉంటాడు అని కాజల్ తెలిపింది. కాజల్ అగర్వాల్ ప్రభాస్ తో కలసి డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి చిత్రాల్లో నటించింది. ఆ రెండు చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి.