Asianet News TeluguAsianet News Telugu

బ్లౌజ్ లేకుండా సినిమా మొత్తం, అందుకే అంత రేటు

ఎవడు, సైజ్ జీరో వంటి కొన్ని సినిమాల్లో ఆమె అతిధి పాత్రల్లో కనిపిస్తుంది. అయితే ఆమె ఆ గెస్ట్ రోల్స్ వల్ల నష్టపోయిందేమీ లేదు. ఇప్పుడు కూడా ఆమె మరో సినిమాలో గెస్ట్ గా కనిపించబోతోంది. ఆమె పాత్ర ఓ గిరిజన యువతి అని తెలుస్తోంది. ఆమె ఆ పాత్ర కోసం బ్లౌజ్ కూడా వేసుకోకుండా కనిపిస్తుంది. ఇంతకీ ఏ సినిమాలో అంటారా...

Kajal Aggarwal cameo in Rana Daggubati film
Author
Hyderabad, First Published Aug 8, 2020, 6:21 PM IST

కాజల్ అగర్వాల్ మనకున్న బిజీ అర్టిస్టుల్లో ఒకరు. అలాగే ప్రతిభావంతురాలైన హీరోయిన్. ఆమె స్టార్స్ అందిరితోనూ వరసగా సినిమా లు చేసింది. సీనియర్ హీరోలతో పాటు యంగ్ హీరోలందరిలో మంచి రాప్ వుట్ ఉంది. ఈ నేపధ్యంలో ఆమె కొన్నిసార్లు మొహమాటంతోనూ గెస్ట్ రోల్స్ చేస్తూ వచ్చింది. ఎవడు, సైజ్ జీరో వంటి కొన్ని సినిమాల్లో ఆమె అతిధి పాత్రల్లో కనిపిస్తుంది. అయితే ఆమె ఆ గెస్ట్ రోల్స్ వల్ల నష్టపోయిందేమీ లేదు. ఇప్పుడు కూడా ఆమె మరో సినిమాలో గెస్ట్ గా కనిపించబోతోంది. ఆమె పాత్ర ఓ గిరిజన యువతి అని తెలుస్తోంది. ఆమె ఆ పాత్ర కోసం బ్లౌజ్ కూడా వేసుకోకుండా కనిపిస్తుంది. ఇంతకీ ఏ సినిమాలో అంటారా...

రానా హీరోగా హిందీలో రూపొందుతున్న 'హాథీ మేరీ సాథీ' చిత్రంలో కాజల్ ఓ గెస్ట్ రోల్ చేసింది. ఈ సినిమా తెలుగులో అరణ్య గా రిలీజ్ అవుతోంది. ఇందులో ఆమె పాత్ర లెంగ్త్ మరి గెస్ట్ రోల్ లా కాకుండా అరగంట సేపు ఉంటుందట. అయితే  ఇందుకు గాను ఆమె సుమారు 70 లక్షలు తీసుకున్నట్టు సమాచారం. ఇందులో ఆమె ఆదివాసీ యువతిగా కనిపిస్తుంది. దీంతో వాళ్ల సంప్రదాయాల ప్రకారం బ్లౌజ్ వేసుకోకుండా కేవలం చీరకట్టులోనే కాజల్ కనిపించాలని చెప్పటంతో ఆమె ఈ స్దాయిలో పేమెంట్ తీసుకుంటోందని చెప్తున్నారు.
  
 ఇక కాజల్ దగ్గర మొదట నుంచీ రెమ్యునేషన్  వద్ద మొహమాటాలు వుండవు. తమ కెరీర్ స్పాన్ తక్కువగా వుంటుంది కాబట్టి, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టేసుకుంటాను అన్నట్లుగానే కెరీర్ ని ప్లాన్ చేసుకుంది. అందుకే, హీరోయిన్ వేషమైనా, ఐటం సాంగ్ అయినా, గెస్ట్ రోల్ అయినా తమ డిమాండును బట్టి నిర్మాత నుంచి ముక్కుపిండి మరీ వసూలు చేసింది. తాజాగా ఈ అందాలభామ  గెస్ట్ పాత్ర పోషించినందుకు భారీ మొత్తంలో ఛార్జ్ చేసిందట.
 

Follow Us:
Download App:
  • android
  • ios