అందాల చందమామ కాజల్ అగర్వాల్ కు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్హ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దాదాపు దశాబ్దానికి పైగా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. గ్లామర్ పాత్రల్లో నటించినా, ఐటెం సాంగ్స్ చేసినా ఎప్పుడూ కాజల్ అగర్వాల్ హద్దులు దాటి అందాలు ఆరబోయలేదు. కాజల్ చీరకట్టులో కనిపించినా ఫిదా అయ్యే అభిమానులు ఉన్నారు. 

కాజల్ అగర్వాల్, శర్వానంద్ జంటగా నటిస్తున్న చిత్రం రణరంగం. స్వామిరారా ఫేమ్ సుధీర్ వర్మ ఈ చిత్రానికి దర్శకుడు. రణరంగం చిత్రంలో శర్వానంద్ రెండు విభిన్నమైన గెటప్స్ లో కనిపిస్తున్నాడు. కళ్యాణ్ ప్రియదర్శన్, కాజల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. 

రణరంగం చిత్రం ఆగష్టు 15న విడుదలకు సిద్ధం అవుతుండడంతో చిత్ర యూనిట్ జోరుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తాజగా ఈ చిత్రంలోని 'పిల్ల పిక్చర్ పర్ఫెక్ట్' అంటూ సాగే వీడియో సాంగ్ ని రిలీజ్ చేశారు. ఈ సాంగ్ లో కాజల్ అగర్వాల్ గ్లామరస్ లుక్ లో అదరగొడుతోంది. కాజల్ వేస్తున్న సెక్సీ స్టెప్పులు యువతని ఆకర్షించే విధంగా ఉన్నాయి. 

ఇప్పటికే విడుదలైన టీజర్ కు మంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.