టాలీవుడ్ లో సీత - రణరంగం సినిమాలతో వరుస అపజయాలు అందుకున్న కాజల్ అగర్వాల్ కోలీవుడ్ లో మాత్రం బాక్స్ ఆఫీస్ హిట్స్ తో దూసుకుపోతోంది. ఇటీవల తమిళ్ లో రిలీజైన కాజల్ కోమలి సినిమా 25కోట్ల కలెక్షన్స్ తో అందరిని ఆశ్చర్యపరిచింది. ఇక ఇప్పుడు అమ్మడు బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. 

గ్యాంగ్ స్టర్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ముంబై సాగ సినిమాలో కాజల్ అగర్వాల్ జాన్ అబ్రాహం సరసన నటించడానికి ఒప్పుకుంది. అయితే సౌత్ లో ప్రస్తుతం రెండు కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్న కాజల్ బాలీవుడ్ సినిమాకు అంతకంటే ఎక్కువె తీసుకుంటుందని రీసెంట్ గా రూమర్స్ వచ్చాయి. కానీ కాజల్ చిత్ర నిర్మాతల అఫర్ నచ్చి కేవలం 30 లక్షలకే ఒప్పుకుందట. 

ఎప్పటి నుంచో బాలీవుడ్ అఫర్ కోసం ఎదురుచూస్తున్నా కాజల్ కి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పవచ్చు. అందుకే సినిమాలో పాత్ర నచ్చి రెమ్యునరేషన్ ని లెక్క చేయకుండా నటించడానికి ఒప్పుకుందట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ మరికొన్ని రోజుల్లో మొదలు కానుంది. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.