ప్రపంచంలో అద్భుత కట్టమైన తాజ్ మహల్ ని జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే అంటోంది టాలీవుడ్ బ్యూటీ కాజల్ అగర్వాల్. రీసెంట్ గా షూటింగ్ కి కాస్త గ్యాప్ ఇచ్చిన ఈ బ్యూటీ ప్రస్తుతం విహార యాత్రలతో బిజీగా మారింది. గతంలో ఎప్పుడు లేని విధంగా తాజ్ మహల్ ముందు కేరింతలతో ఫొటోలకి స్టిల్ ఇచ్చింది. 

ప్రస్తుతం కాజల్ కి సంబందించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో చందమామ ఉదయాన్నే తాజ్ మహల్ ముందుకు వచ్చిందేంటి అంటి నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇక కాజల్ ఇచ్చిన క్యాప్షన్ కూడా నెటిజన్స్ ని ఆకట్టుకుంటోంది. 

తాజ్ మహల్ ని చుడగానే మైకం కమ్మినంత పని అయ్యిందంటూ గతంలోనే ఈ అద్భుత కట్టడ అందాల గురించి విన్నాను అని, అలాగే ఇప్పుడు ఆ అందాలు తనను గతంలోకి తీసుకెళ్లాయి అని కాజల్ పేర్కొంది. తాజ్ మహల్  ముద్దాడినట్లు కాజల్ ఇచ్చిన స్టిల్ ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.